YCP MP Gorantla Madhav : బిగ్ బ్రేకింగ్: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై సస్పెన్షన్ వేటు.?
NQ Staff - August 4, 2022 / 07:28 PM IST

YCP MP Gorantla Madhav : హిందూపురం లోక్ సభ సభ్యుడు, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌దిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. దాన్ని ఫేక్ వీడియోగా గోరంట్ల మాధవ్ అభివర్ణిస్తున్నారు. జిల్లా ఎస్పీకీ అలాగే సైబర్ క్రైమ్ విభాగానికీ తాను ఫిర్యాదు చేశానని కూడా అంటున్నారాయన.
అయితే, వైసీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసే దిశగా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోబోతోందంటూ వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ‘గోరంట్ల మాధవ్‌ని పార్టీలోంచి సస్పెండ్ చేయాలి..’ అంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగానికే చెందిన కొందరు మహిళలు సోషల్ మీడియా వేదికగా నినదిస్తుండడం గమనార్హం.
డ్యామేజ్ కంట్రోల్ చర్యలు..

Suspension orders against YCP MP Gorantla Madhav
పరిస్థితి అదుపు తప్పుతోందన్న భావనతో డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది వైసీపీ అధిష్టానం. వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించుకుని, జరిగిన వ్యవహారంపై ఆరా తీశారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
‘న్యూడ్ వీడియో విషయమై గోరంట్ల మాధవ్ ఇప్పటికే స్పందించారు, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అది ఒకవేళ మార్ఫింగ్ వీడియో కాదని తేలితే, ఆయనపై కఠిన చర్యలు వుంటాయి పార్టీ పరంగా..’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
‘ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించేదే లేదు. ఎవరూ ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా కఠినంగా శిక్షిస్తాం..’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. అంటే, వైసీపీ.. గోరంట్ల మాధవ్‌ని సస్పెండ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లే భావించాలేమో.!