ABN Andhrajyothi: ఏబీఎన్ రాధాకృష్ణకు.. సుప్రీంకోర్టులో చుక్కలు..

ABN Andhrajyothi: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఎండీ రాధాకృష్ణకు ఇవాళ సోమవారం సుప్రీంకోర్టులో చుక్కలు కనిపించాయి. ఏపీ సర్కార్ పై ఈ మీడియా సంస్థ కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీసీఐడీ బుక్ చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్ పేరును కూడా చేర్చగా దాన్ని రాధాకృష్ణ సవాల్ చేశారు. కేసు విచారణలో స్టే ఇవ్వాలని కోరారు. అయితే దీనికి న్యాయస్థానం ఒప్పుకోలేదు. ఏబీఎన్ పై కేసును సీఐడీ దర్యాప్తు చేసుకోవచ్చంటూ ఏపీ గవర్నమెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాధాకృష్ణ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.

ABN AndhraJyoti

అప్పుడు చూద్దాంలే..

సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలా వద్దా అనేది ఆరు వారాల తర్వాత డిసైడ్ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. అప్పటివరకు విచారణను వాయిదా వేసింది. కేసులోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏబీఎన్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ మల్హోత్రా, గుంటూరు ప్రమోద్ వాదనలు వినిపించారు.

ABN Andhra Jyoti

కోర్టుకే మస్కా కొడతారా?..

ఎంపీ రఘురామకృష్ణరాజు రోజూ ఏబీఎన్ ఛానల్ లో రచ్చబండ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అందులో ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తిట్ల దండకం అందుకునేవారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారు. తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ ఆయనతోపాటు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లపై కేసులు పెట్టింది. కానీ ఏబీఎన్ ఛానల్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించాలని చూసింది. కరోనా వార్తలను ప్రసారం చేస్తుంటే అడ్డుకున్నారంటూ అడ్డమైన వాదనకు దిగింది. పైగా దీన్ని సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనగా అభివర్ణించింది. ఎఫ్ఐఆర్ ను ఏకంగా రద్దు చేయాలని కూడా రిక్వెస్ట్ చేసింది. కానీ వాళ్ల పప్పులు ఉడకలేదనే సంగతి ఇవాళ్టి జడ్జిమెంటుతో తేలిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నైతిక మద్దతుతో ఏపీ గవర్నమెంట్ ఏబీఎన్ ఛానల్ పై దర్యాప్తును మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తుందని చెబుతున్నారు.