Raghurama: రఘురామకృష్ణరాజు ఆశలపై నీళ్లు

Raghurama: సుప్రీంకోర్టు ఈ నెల 21న అంటే శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేయటంతో ఇంకేముంది రెండు మూడు రోజుల్లో రిలీజ్ కావటమే తరువాయి అనుకున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. ఆయన మరో నాలుగు రోజుల పాటు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎంపీ తరఫు అడ్వొకేట్లు ఇవాళ సోమవారం డిశ్చార్జ్ సమ్మరీ కోరగా ‘ఇప్పుడే కాదు. ఆగండి. ట్రీట్మెంట్ నడుస్తోంది’ అంటూ హాస్పిటల్ నుంచి ఊహించని రిప్లై రావటంతో చేసేదేమీలేక నిరాశ చెందారు. నిజానికి వాళ్లు ఆర్మీ ఆస్పత్రి వద్దకు వెళ్లలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ వద్ద ష్యూరిటీస్ పిటిషన్ ని దాఖలు చేశారు. దీంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ సమ్మరీ కావాలని న్యాయమూర్తి అడిగారు. కానీ అది లేకపోవటంతో నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఈ వ్యాఖ్యాన్ని దాఖలు చేయనున్నారు. అప్పటి వరకు బెయిల్ పై విడుదలకు ఛాన్స్ లేదని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు.

MP Raghurama Bail Issue

ఎంత తొందరపడితే..

సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా రఘురామకృష్ణరాజుపై గుంటూరులోని ట్రయల్ కోర్టులో కేసు నడుస్తోంది. అంతేకాదు. ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో నేరుగా ఆర్మీ ఆస్పత్రి నుంచి రిలీజ్ కావటానికి వీల్లేకుండా పోయింది. డాక్టర్లు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చాక, దాన్ని గుంటూరు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో సబ్మిట్ చేశాక విడుదల ప్రక్రియ జరగాల్సి ఉంది. మనం కొన్నిసార్లు అనుకున్నవి అనుకున్నట్లు జరగవు. ఎంత తొందరపడితే అంత ఆలస్యమవుతుంది. రఘురామకృష్ణరాజు ఈరోజు బయటికి రావటం వంద శాతం ఖాయమనుకుంటే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.

MP Raghurama Bail Issue

అరెస్టయి 10 రోజులు దాటింది..

రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు ఈ నెల 14వ తేదీన ఆయన పుట్టిన రోజు నాడే అదుపులోకి తీసుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య 18వ తేదీ (మంగళవారం) రాత్రికి సైనిక ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆయన అరెస్టయి, ఇంటి నుంచి బయటకు వచ్చి నిన్నటికే 10 రోజులైంది. ఆర్మీ హాస్పిటల్ కి వచ్చి వారం రోజులవుతోంది. రెండు పాదాలకు తీవ్రంగా గాయాలు కావటంతో చికిత్స పొందుతున్నారు.