Egg Dosa: ఎగ్ దోశ తినడానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Egg Dosa: చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకోవడం ఈ మధ్య చాలా చూస్తున్నాం. కోడిగుడ్డ దోశ తింటానని.. డబ్బులివ్వమని అడిగితే ఇంట్లో వారు ఇవ్వలేదని అలిగి.. తీవ్ర మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థి తన ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయి గ్రామ శివార్లలోని కుంటలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Student Suicide in Chittoor For Not Giving Money to Egg Dosa
Student Suicide in Chittoor For Not Giving Money to Egg Dosa

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన దివంగత రమణయ్య కుమారుడు సాయి కిరణ్ (21) కోడిగుడ్డు దోశెకు డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కిరణ్ పి.కోత్తకోట సమీపంలోని వేము ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాయి కిరణ్‌ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో గారాబంగా పెంచారు.

చదువులో‌నూ తోటి విద్యార్థుల కంటే ముందుండే సాయి కిరణ్ కోడి గుడ్డు దోశ‌కు డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడిగాడు. వారు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై గొడవకు దిగాడు. కోపంతో మొబైల్ ఫోన్ ఇంట్లోనే వదిలి బయటికి వెళ్లాడు. కోపం తగ్గాక వస్తాడని భావించిన కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా ఉండి పోయారు.

Student Suicide in Chittoor For Not Giving Money to Egg Dosa
Student Suicide in Chittoor For Not Giving Money to Egg Dosa

సాయి కిరణ్ గ్రామానికి సమీపంలో ఉన్న గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుంటలో శవం కనిపించడంతో స్థానికులు, వ్యవసాయ పనులు చేసే వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.