ABN Radhakrishna : ఇప్పుడేమి చేస్తావ్ ఏ‌బి‌ఎన్ రాధాకృష్ణా ? కరక్ట్ టైమ్ లో బాబు + ఆర్‌కే కి జగన్ షాక్ ?

ABN Radhakrishna

ABN Radhakrishna (ఏ‌బి‌ఎన్ రాధాకృష్ణా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ న్యూస్ ఛానల్స్ పై జగన్ సర్కార్ కొరడా జులిపిస్తోంది. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలకు సపోర్టుగా వార్తలు ప్రసారం చేస్తున్న ఛానల్స్ పై ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇటీవలే ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని దక్కించుకున్న గౌతమ్ రెడ్డి వ్యతిరేక ఛానల్స్ లపై చర్యలు తీసుకుంటున్నారు. స్పెషల్ రెస్పాన్సిబిలిటీని తన భుజాలపై వేసుకున్న ఆయన ప్రస్తుతం అన్ని జిల్లాల కేబుల్ ఆపరేటర్లతో చర్చ పెట్టి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ తో పాటు టీవీ-5 ఛానల్ ని నిలిపి వేస్తారా లేక స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లని కట్ చేయమంటారా? అని ప్రశ్నించారు. కొందరు కేబుల్ ఆపరేటర్లు ఇందుకు నిరాకరించడంతో.. ఇది సీఎం జగన్ ఆర్డర్ అని చెప్పి వారందరినీ పంపించేశారు. దీనితో చేసిదేమి లేక సీఎం ఆర్డర్ ప్రకారం ఆ రెండు ఛానళ్లను నిలిపివేయడానికి అన్ని జిల్లాల కేబుల్ ఆపరేటర్లు అంగీకరించినట్టు తెలుస్తోంది.

Strong Shock to abn radhakrishna ఏ‌బి‌ఎన్ రాధాకృష్ణా
Strong Shock to abn radhakrishna

అయితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా టీవీల ముందు కూర్చున్నారు. కానీ ఏబీఎన్, టీవీ5 ఛానల్స్ బ్యాన్ కావడంతో తమకు ప్రతిపక్ష పార్టీల గురించి ఎటువంటి వార్తలు తెలియడం లేదని జనాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా ఈ రెండు ఛానెల్స్ నిషేధం పై టీడీపీ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ మీడియా పై ఆంక్షలు విధించడం అన్యాయమని ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతూ ఈ విషయంలో గవర్నర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మీడియా ఛానల్స్ పై విధించిన ఆంక్షల గురించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం కేబుల్ ఆపరేటర్లు ఏపీ ఆర్డర్స్ ని ఫాలో అవుతూ ఉండడంతో టీవీ5, ఏబీఎన్ ఛానెల్స్ రావడం లేదు. అవి కేవలం యూట్యూబ్, డీటీహెచ్ లలోనే వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల వ్యవహారం గురించి అనేక వార్తా కథనాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలను కట్టడి చేసేందుకే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని టీడీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే గతంలో కూడా ఈ రెండు ఛానల్స్ పై బ్యాన్ విధించడంతో ఆ ఛానెళ్ల యాజమాన్యాలు నేషనల్ లెవెల్ రెగ్యులేటరీ అథారిటీ సంస్థలకు ఫిర్యాదు చేసి చాలా కాలం న్యాయపోరాటం చేసి తమ ప్రసారాలను మళ్ళీ ప్రారంభించారు. ఇప్పుడు కూడా అలా చేయగలరు కానీ అప్పటి లోపు స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు తిరుపతి ఉపఎన్నికలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. దీనితో కరక్ట్ టైమ్ లో బాబు, ఆర్‌కే కి జగన్ షాక్ ఇచ్చినట్లయింది.

Advertisement