Ippatam Village : ఇప్పటంలో ఎట్టకేలకు వైఎస్సార్ విగ్రహం తొలగింపు.!

NQ Staff - November 9, 2022 / 04:12 PM IST

Ippatam Village : ఇప్పటంలో ఎట్టకేలకు వైఎస్సార్ విగ్రహం తొలగింపు.!

Ippatam Village : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రహదార్ల వెడల్పు ప్రక్రియలో భాగంగా పలు ఇళ్ళకు సంబంధించి తొలగింపులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై జనసేన సీరియస్ అయ్యింది. జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామస్తులు తమ భూముల్ని ఇవ్వడంతోనే ప్రభుత్వం ఆ గ్రామంపై కక్ష గట్టి అవసరం లేకపోయినా రోడ్ల వెడల్పు పేరుతో ఇళ్ళను తొలగించిందన్నది జనసేన ఆరోపణ.

ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఇప్పటం వెళ్ళి, అక్కడి గ్రామస్తులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వారి తరఫున జనసేన న్యాయ పోరాటం కూడా చేస్తోంది. ఇళ్ళు ధ్వంసమైనవారికి లక్ష రూపాయల చొప్పన సాయం అందించేందుకు జనసేన ముందుకొచ్చింది.

అప్పుడు తొలగించని విగ్రహం.. ఇప్పుడు తొలగించబడింది..

వైఎస్ విగ్రహం రోడ్డుకు అడ్డంగా వున్నా, దాన్ని తొలుత తొలగించ లేదు. ఈ విషయమై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం పేదల ఇళ్ళ మీదనే వైసీపీ సర్కారు కక్ష కట్టిందని ఆరోపించింది.

జనసేన నుంచి వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ సర్కారు దిగిరాక తప్పలేదు. తాజాగా వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించింది. దాంతో, ఈ వివాదం కొంతమేర సద్దుమణిగినట్లే భావించాలేమో.! ఈ తొలగింపు ఏదో గతంలోనే చేసి వుంటే, ఇంత దుమారం చెలరేగేది కాదు కదా.?

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us