జగన్ కి అతిపెద్ద మెలిక పెట్టిన అచ్చెన్నాయుడు .. ఇది పెద్ద ఛాలెంజ్ ?
Admin - November 9, 2020 / 01:00 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజధాని రణరంగం కొనసాగుతూనే ఉంది. అయితే మొదటగా టీడీపీ అధికారంలో కి రాగానే అమరావతిని రాజధానిగా ప్రకటించాడు చంద్రబాబు. ఇక ఆ సమయంలోనే అమరావతిలో పలు అభివృద్ధి పనులు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటె రెండవ సారి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇక జగన్ అధికారం చేపట్టగానే ఏపీలో మూడు రాజధానులను నియమించాలని ప్రస్తావించాడు. అయితే మూడు రాజధానులలో విశాఖ, కర్నూల్, అమరావతి లను నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడు.
దీనితో ఒక్క రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటని టీడీపీ మరియు పలువురు ప్రజలు మండిపడ్డారు. అంతేకాదు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ పెద్ద ఎత్తున ప్రజలను రెచ్చగొడుతూ ‘ సేవ్ అమరావతి ‘ అనే ఉద్యమాన్ని చేపట్టింది. ఇక ఎన్ని ఉద్యమాలు చేసిన జగన్ మాత్రం అమరావతిని రాజధానిగా కొనసాగించే ప్రసక్తే లేదని ఒకే మాటపై ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరో కొత్త డిమాండ్ ను తెర పైకి తీసుకువచ్చాడు.
ఏపీకి శ్రీకాకుళం రాజధానిగా నియమించాలని, అలా నియమిస్తే అక్కడి భూములు ఉచితంగా ఇస్తామని అచ్చెన్నాయుడు జగన్ కు భారీ ఆఫర్ ఇచ్చాడు. శ్రీకాకుళం పక్కనే ఉన్న విశాఖను రాజధానిగా ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే ప్రసక్తే లేదని అచ్చెన్న హెచ్చరించాడు. ఏపీ కి అమరావతి లేదా శ్రీకాకుళం ప్రాంతాలలో రాజధానిగా ఏ ప్రాంతాన్ని నియమించిన అంగీకరిస్తామని చెప్పుకొచ్చాడు. దీనితో అచ్చెన్నాయుడు పెట్టిన చిచ్చుకు, జగన్ కు పెద్ద ఛాలెంజ్ గా మారింది.