Sr NTR : స్వర్గీయ ఎన్టీయార్‌ని ఒంటరిని చేసి చంపిందెవరు.?
NQ Staff - September 27, 2022 / 04:46 PM IST

Sr NTR : స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎలా చనిపోయారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. వృధ్యాప్యానికి తోడు, మానసిక వ్యధ ఆయన మరణానికి కారణంగా చెబుతారు. భార్య లక్ష్మీపార్వతి ఆయన మరణానికి కారణమని కొందరు అంటుంటారు. చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు వల్లనే.. అంటారు ఇంకొందరు.
ఏది నిజం.? ఏమోగానీ, ‘స్వర్గీయ నందమూరి తారక రామారావుని చంపేశారు..’ అంటూ తాజాగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. అప్పుడెప్పుడో చంపేస్తే, ఇన్నాళ్ళూ ఎందుకు లక్ష్మీపార్వతి పోలీసులను ఆశ్రయించలేదు.?
సోమిరెడ్డి వింత వాదన..
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, లక్ష్మీపార్వతికి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. చివరి రోజుల్లో ఆయన్ని ఒంటరిని చేసి ఎవరు చంపేశారో ప్రపంచమంతటికీ తెలుసంటూ సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.
ప్రపంచమంతటికీ తెలిసిన ఆ విషయాన్ని ఎందుకు చట్టబద్ధంగా తెలుగుదేశం పార్టీ నిరూపించలేకపోయింది.? సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు సరైన రీతిలో దర్యాప్తు చేస్తే, ఆనాటి ఆ స్వర్గీయ ఎన్టీయార్ డెత్ మిస్టరీని ఇప్పటికైనా ఛేదించగలవు. కానీ, దానిక్కావాల్సిందల్లా చిత్తశుద్ధి మాత్రమే.
ఎన్టీయార్ కుటుంబ సభ్యుల్లో ఎవరూ ఆయన మరణం పట్ల సీబీఐ విచారణ కోరే అవకాశమే లేదు. ఎన్టీయార్ మరణం చాలామందికి రాజకీయంగా ఇప్పటికీ టైమ్ పాస్ అందిస్తోంది.