Special Story on Lalithaa Jewellery: లలితా జ్యువెలర్స్.. నాట్ ఏ నేమ్.. ఇట్స్ ఏ బ్రాండ్

NQ Editor - June 29, 2023 / 11:02 AM IST

Special Story on Lalithaa Jewellery: లలితా జ్యువెలర్స్.. నాట్ ఏ నేమ్.. ఇట్స్ ఏ బ్రాండ్

Special Story on Lalithaa Jewellery:

తన సంకల్పం ముందు పేదరికం నిలవలేదు. తన ఆత్మవిశ్వాసం ముందు పరిస్థితులు గెలవలేదు.

గెలచి నిలవాన్న తపనతో తలపడ్డాడే తప్ప.. ఎన్ని అడ్డంకులెదురైనా తడబడలేదు.

బంగారం లాంటి పట్టుదలనే నమ్ముకున్నాడు. నేడు పట్టిందల్లా బంగారం అన్నంతలా ఎదిగాడు.

గెలుపు కోసం సాయపడడానికి వెనకేసిన ఆస్తులు లేవు. ముందుకెళ్లాలనే దృఢ సంకల్పం ఒక్కటే ఉంది.

చేతిలో గ్రాము బంగారంతో ప్రారంభమైన తన ప్రయాణం ఈరోజు వేల కోట్ల టర్నోవరుకి చేరుకుంది. వందలాది మందికి ఉద్యోగాల్ని, వేలాది కస్టమర్లకి నమ్మకాన్నిచ్చింది. బంగారు నగల విక్రయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా చేసింది. తనంటే తెలుగు రాష్ట్రాల్తో తెలియని వారు లేరు అన్నంతగా అందనంత ఎత్తులో నిలబెట్టింది.

లలితా జువెలర్స్ అంటే పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్. నమ్మకానికి, వ్యాపార విలువలకు, మధ్యతరగతి ఆశలకి అన్నిటికీ మచ్చ లేని బ్రాండ్.

ఏ స్థాయికెళ్లినా ఎక్కడ మొదలయ్యామో అనే మూలాల్ని మర్చిపోకుండా, ఎంత ఎత్తుకెదిగినా నేలని విస్మరించకూడదని నమ్మిన వాళ్లే అసలైన విజేతలు. ఆ మాటని అక్షారాలా నమ్మినవాడు లలితా జ్యువెలర్స్ కిరణ్. అందుకే ఏమీ లేని నాడు ఏ నెల్లూరు నుంచి తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించాడో అదే నెల్లూరులో 50 వ లలితా జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించనున్నాడు.

Special Story on Lalithaa Jewellery

Special Story on Lalithaa Jewellery

కిరణ్ ఇన్స్పిరేషనల్ జర్నీ

చదువు లేదు, డబ్బు లేదు, పుట్టింది చిన్న గ్రామంలో. పేదరికం వల్ల ఇంట్లో ఎన్నో కష్టాలు చూసి చదువు వద్దనుకోని నెల్లూరులోని ఓ ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు కిరణ్. కొన్నిరోజులకి అమ్మ రెండు గాజులు 48 గ్రాములు, ఒక్కో గాజు 24 గాజులు. వాటిని తీసుకుని కరిగించి అమ్మడానికి చెన్నై వెళ్లాడు. కానీ అమ్మడానికి చాలా కష్టపడ్డాడు. ఎన్ని షాపులు తిరిగినా ఎవరూ కొనలేదు. కానీ లలితా జ్యువెలరీ తీసుకుంది. మరింత బంగారం అప్పజెప్పి పని కూడా ఇచ్చింది. అలా మెల్లిగా బంగారం హోల్ సేల్ వ్యాపారంలో టాప్ ప్లేస్ కి ఎదిగాడు కిరణ్. ఓ రోజు లలితా జ్యువెలర్స్ ఫౌండర్ కంద స్వామి రాత్రి కిరణ్ ని షోరూమ్ కి పిలిచి నేను కష్టాల్లో ఇరుక్కున్నాను, జైలుకెళ్లేలా ఉన్నాను, షోరూమ్ మూసేయబోతున్నానని చెప్పడంతో, నాకు అన్నం పెట్టిన ఈ షోరూమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మూతపడకూడదు అనడంతో అదే రోజు అద్దరాత్రి లలితా జ్యువెలరీని టేకోవర్ చేసుకున్నాడు కిరణ్.

కిరణ్ మొన్నటివరకూ మన సప్లయర్. ఇవాళ కాంపిటీటర్ అని తోటి షోరూమ్ వాళ్లు బంగారం కొనడం మానేశారు. ఒక్కరు కూడా కొనకుండ, పాత డబ్బుల కింది నగలిచ్చేసి సెటిల్ చేశారు. దాంతో హోల్ సేల్ బిజినెస్ కంప్లీట్ డౌన్. మళ్లీ మొదటికొచ్చేశాడు కిరణ్. అయినా మనసు ఒకటే చెప్తుంది, గెలవగలవు అని. దాంతో ఆరు నెలలు రీటెయిల్ వ్యాపారం చేసి ఆ తర్వాత హోల్ సేల్ ధరలకే రీటెయిల్ అమ్మకాలు స్టార్ట్ చేశాడు. ఇంకో బ్రాండ్ అంబాసిడర్ పెడితే ఆ సెలబ్రిటీ ఖర్చులు కూడా జనాల దగ్గరే వసూలు చేయాలి. అందుకే ఎవరూ వద్దనుకోని తానే ప్రచారం చేసుకున్నాడు. క్రమంగా షోరూములు పెరిగి, ఇప్పుడు 18 నుంచి 20 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తోంది లలితా జువెలర్స్. లాభం తక్కువే కానీ సేల్స్ ఎక్కువ. రానున్నరోజుల్లో వందో షోరూమ్ పెట్టి యాభై వేల కోట్ల టర్నోవర్ చేయాలనేది నా లక్ష్యం అని అదే నమ్మకంతో చెప్తున్నాడు కిరణ్. జీవితంలో పోటీ, పేదరికం అన్నీ ఉంటాయి. కానీ మన మీద, మన ఆలోచనల మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధించొచ్చు అన్న మాటకి ఉదాహరణే కిరణ్ స్టోరీ.

ఎక్కడ ఎన్ని బ్రాంచులున్నా నెల్లూరులో(lalitha jewellery nellore) మాత్రం ప్రత్యేకమే. ఎందుకంటే ఇంతగా ఎదగాలన్న ఆ నాటి తన కల, కోరిక, సంకల్పం నెరవేర్చిన ఈ రోజు అక్కడే ప్రారంభమయ్యింది కాబట్టి. ఇప్పుడనే కాదు, ఈ బ్రాంచనే కాదు, ఎప్పుడయినా ఎక్కడయినా కష్టపడి ఎదగాలనుకునేవారికీ, కస్టమర్లకి బెస్ట్ అందించేలనుకునేవారికి లలితా జ్యువెలర్స్.. నాట్ ఏ నేమ్.. ఇట్స్ ఏ బ్రాండ్.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us