TDP Leaders : మంత్రి రోజాని టార్గెట్ చేసిన టీడీపీ.! ఆ వీడియోలు మళ్ళీ తెరపైకి.!
NQ Staff - September 30, 2022 / 08:26 PM IST

TDP Leaders : వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేసినా, అవి ఫలించలేదు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహించారామె.
అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద రోజా చేసిన విమర్శల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజశేఖర్ రెడ్డి పంచెకట్టు మీద కూడా మాటలు తూలారు రోజా. అదంతా గతం. ఇప్పుడామె దృష్టిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే, ‘మహా నేత’.!
రేప్పొద్దున్న మళ్ళీ టీడీపీలోకి వెళితే, చంద్రబాబు దేవుడవుతారా.?
రోజాకి సంబంధించి ఏవో వీడియోలు వున్నాయనీ, అవి బయట పెడతామనీ పదే పదే టీడీపీ నేతలు కొందరు బ్లాక్ మెయిల్ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, రోజా ఏనాడూ వాటికి లొంగలేదు.
ఆ సంగతి పక్కన పెడితే, గత కొద్ది రోజులుగా రోజాకి సంబంధించిన కొన్ని వీడియోల్ని టీడీపీ సోషల్ మీడియా విభాగం ప్రత్యేకంగా పాపులర్ చేస్తోంది. అవి గతంలో ఓ ఛానల్‌లో (టీడీపీ అనుకూల మీడియానే) రోజా ఇచ్చిన ఇంటర్వ్యూ, అందులో రాజశేఖర్ రెడ్డిని విమర్శించి, చంద్రబాబుని పొగిడిన అంశాల్ని ఆ వీడియోల ద్వారా ప్రచారంలోకి తెస్తున్నారు.
అయితే, రాజకీయాలన్నాక మాట మార్చడం మామూలే. చంద్రబాబు గతంలో మోడీని గొప్ప నాయకుడన్నారు, ఆ తర్వాత విమర్శించారు. ఎన్టీయార్ విషయంలో చంద్రబాబు చేసిందేంటి.? రాజకీయం అంటేనే అంత.!