బ్రేకింగ్ : ఇన్నాళ్ళకి ఏలూరు వింత వ్యాధి కారణం తెలిసింది
Admin - January 7, 2021 / 04:57 PM IST

గత నెలలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన ఏలూరు అనారోగ్యంకు కారణం నీళ్లు అనుకున్నారు. నీటిలో ఉన్న కాలుష్యం వల్లే ఏలూరు జనాలు అనారోగ్యం పాలయ్యారు అంటూ ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కాని తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ మరియు శాస్త్రవేత్తలు అధికారులు గుర్తించిన దాని ప్రకారం ఏలూరు ప్రజల అనారోగ్యంకు కారణం నీళ్లు కాదని వారు తీసుకున్న కూరగాయలు అంటూ వెళ్లడి అయ్యింది. వారు తీసుకున్న నాన్ వెజ్ కారణంగా అనారోగ్యంకు గురయ్యారు అనే వార్తలు కూడా వచ్చాయి. కాని అది కూడా నిజం కాదని తేలిపోయింది. కూరగాయల్లో ఉన్న ఒక రసాయన పదార్థం వల్లే వారు అస్వస్థతకు గురి అయినట్లుగా అధికారులు చెబుతున్నారు.

secret revealed about Eluru disease
వింత వ్యాధి విషయంలో ఉన్న అనుమానాలు అన్నింటికి సమాధానం లభించింది. స్థానిక రైతులు పండించిన పంటలను మరియు పాటు ఇతర ఆహార పదార్థాలను సేకరించి పరీక్షించిన సమయంలో అంతా బాగానే ఉందని, కాని కొన్ని రోజుల క్రితం తీసుకున్న కూరగాయాల్లో విష పదార్థాలు ఉన్నాయని గుర్తించినట్లుగా చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్నత శ్రేణి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్థారించారు అంటూ పేర్కొన్నారు. ఇన్నాళ్లకు వింత వ్యాధికి గల కారణంను గుర్తించడంలో అధికారులు సఫలం అయ్యారు. కూరగాయల్లో ఉన్న ఆర్గానో క్లోరిన్ కారణంగా అనారోగ్యం పాలయ్యారు అంటూ వెళ్లడి అయ్యింది.

secret revealed about Eluru disease
మొదట అనుకున్నట్లుగా నీటి వల్ల ఎలాంటి సమస్య లేదు అని అంటున్నారు. గత కొన్ని రోజులుగా రెగ్యులర్ గా నీరు మరియు వివిధ రకాల పదార్థాల పై పరిశోదనలు జరుగుతున్నాయి. ఏలూరు వ్యాప్తంగా జనాలు ఏం తింటున్నా కూడా పరీక్షలు జరుగుతున్నాయని కూడా అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర అధికారులు ఈ విషయమై చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని మరీ ఈ విషయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. పురుగు మందుల ప్రభావంతోనే ఏలూరు వింత వ్యాధి సోకిందని వెళ్లడి అవ్వడంతో కూరగాయలు కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని స్థానికులను అధికారులు కోరుతున్నారు.