Sajjala Ramakrishna : అప్పుడు వైఎస్సార్‌ పై.. ఇప్పుడు జగన్ పై కుట్ర

NQ Staff - April 18, 2023 / 08:03 PM IST

Sajjala Ramakrishna : అప్పుడు వైఎస్సార్‌ పై.. ఇప్పుడు జగన్ పై కుట్ర

Sajjala Ramakrishna : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కుట్ర జరుగుతుంది అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ఇదే తరహాలో కుట్ర జరిగిందని.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మరియు ఆయన కుటుంబాన్ని కేసులో ఇరికించేందుకుగాను కుట్ర జరుగుతోందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.

సిపిఐ అధికారులు విచారణ చేపట్టకుండా తమకు కావలసిన వారితో వాంగ్మూలం ఇప్పించుకొని కేసుని ముందుకు తీసుకెళ్తున్నారని దస్తగిరి తో మాట్లాడిస్తుంది టిడిపి వాళ్లు అయి ఉంటారని అనిపిస్తుందని కూడా సజ్జల ఆరోపించారు.

టిడిపి ఎంత దిగజారిపోయిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇవాళ టిడిపికి ప్రజలు లేరు.. ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవు.. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసమే వారు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆరోపించారు.

ఈ కేసు పై కేసు నుండి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తారని పార్టీకి మరియు కుటుంబానికి పెద్ద అయిన వివేక చనిపోయి బాధలో ఉన్న ఫ్యామిలీని ఇలా విచారణ పేరుతో మరింత ఇబ్బంది పెట్టడం సరికాదని సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us