Sajjala Ramakrishna Reddy : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
NQ Staff - March 24, 2023 / 06:22 PM IST

Sajjala Ramakrishna Reddy : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అనురాధకు అనుకూలంగా ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యేలపై అధినేత వైఎస్ జగన్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా వైకాపా పార్టీ అధికారికంగా ప్రకటించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకుల నుండి వచ్చిన డిమాండ్ నేపథ్యంలో అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై స్పందిస్తూ చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయల వరకు ఇచ్చి కొనుగోలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా నష్టం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.