YS Vijayamma : వైఎస్ఆర్సీపీ శాశ్వత గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా.. టీడీపీ పుకార్ల‌కు చెక్ పెట్టిన స‌జ్జ‌ల‌

NQ Staff - July 8, 2022 / 11:54 AM IST

YS Vijayamma : వైఎస్ఆర్సీపీ శాశ్వత గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా.. టీడీపీ పుకార్ల‌కు చెక్ పెట్టిన స‌జ్జ‌ల‌

YS Vijayamma : వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన తనయుడు వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించాడు. ఈ పార్టీకి తన తల్లి వైఎస్ విజయలక్ష్మి గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఇక జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ పార్టీ కోసం బాగానే క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ ఆమెకు ఎలాంటి ప‌దవి దక్క‌లేదు. దీంతో ఆమె ప్ర‌త్యేకంగా పార్టీ ఏర్పాటు చేసింది.

పుకార్ల‌కు చెక్..!

Sajjala Made it Clear YS Vijayamma will Remain PostHonorary President

Sajjala Made it Clear YS Vijayamma will Remain PostHonorary President

2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్ కుటుంబంలో విబేధాలు ఉన్నాయని ప్రచారం తెరపైకి వచ్చింది. ఒక్కప్పుడు ఫ్యామిలీ అంతా ఒకే మాటపై కలిసి మెలిసి ఉండేవారు. వైఎస్ షర్మిల తెలంగాణలో సొంతగా పార్టీ ఏర్పాటు చేయడంతో.. కుటుంబంలో విబేధాలు ఉన్నాయనే వార్తలు బయట ప్రపంచానికి తెలిసాయి.. తరువాత పలు సందర్భాల్లో.. కలుసుకున్నా.. ఇద్దరూ మాట్లాడుకున్నది లేదు.

ఇటీవల షర్మిల భర్త బ్రదర్ అనిల్ సైతం ఏపీలో కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే ఇలా గ్యాప్ ఉన్న సమయంలో విజ‌య‌మ్మకి సంబంధించిన ఓ వార్త తెగ హ‌ల్చ‌ల్ చేస్తుది. విజయమ్మ తెలంగాణ లో వైఎస్సార్‌టీపీ కి గౌరవ అధ్యక్షురాలిగా ఉండడంతో రెండు రాష్ట్రాల్లో ఉండడం కుదరదనే ఉద్దేశంతో ఆమెను తప్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ వాయిస్ వినిపిస్తున్న సజ్జల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే జగన్ ఆలోచన. తెలంగాణలో పార్టీపై చాలాసార్లు చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశే ముఖ్యమని.. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్‌ సూచించారు. తెలంగాణలో మరో పార్టీ ప్రారంభించాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోంది. వారి మధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కావు’’ అని సజ్జల చెప్పుకొచ్చారు.

Sajjala Made it Clear YS Vijayamma will Remain PostHonorary President

Sajjala Made it Clear YS Vijayamma will Remain PostHonorary President

ఇక వైఎస్ఆర్సీపీ శాశ్వత గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా చేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను కూడా స‌జ్జ‌ల తిప్పి కొట్టారు. విజయమ్మ గౌరవ అధ్యక్ష ప‌ద‌విలోనే ఉంటార‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా విజ‌య‌మ్మ‌ను జ‌గ‌న్ సాగ‌నంపుతార‌ని టీడీపీ మీడియా తెగ ప్ర‌చారం చేస్తుండ‌గా, వాటన్నింటికి స‌జ్జ‌ల చెక్ పెట్టాడు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 8,9న నిర్వహించే మూడో ప్లీనరీలో ఆ పార్టీ నాయ‌కురాలు విజయమ్మ హాజ‌ర‌వుతారా? లేదా? అన్న సందేహాలు ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఉన్నాయి. అయితే ఆ అనుమానాలకు తెరదించుతూ.. ఆమె వ‌స్తున్నార‌ని అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. రెండవ రోజు ప్లీనరీలో విజ‌య‌మ్మ ప్రసంగించనున్నారు. ఉదయం 10 నుంచి 10.30 గంట‌ల వర‌కు ఆమె ప్రసంగిస్తారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us