RK Roja And Nara Lokesh : నారా లోకేష్ పిల్ల పిత్రేగాడు.! మంత్రి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు.!
NQ Staff - September 15, 2022 / 07:27 PM IST

RK Roja And Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేత, నగిరి ఎమ్మెల్య, మంత్రి రోజా.
నారా లోకేష్‌ని పిల్ల పిత్రేగాడంటూ మండిపడ్డ రోజా, ఎమ్మెల్యేగా గెలవలేక దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయి, మంత్రి పదవి దక్కించుకున్నాడని నారా లోకేష్ మీద విమర్శలు చేశారు. ‘కొడాలి నాని గడ్డంలోని తెల్ల వెంట్రుకని కూడా పీకలేరు..’ అంటూ టీడీపీపై చెలరేగిపోయారు రోజా.
మా నాయకుడ్ని అంటే ఊరుకుంటామా.?

RK Roja Criticizes Nara Lokesh Despicable Manner
మంత్రి రోజా, నారా లోకేష్ మీద మండిపడుతూ ‘వాడు.. వీడు..’ అంటూ సంబోదించారు. అంతే కాదు, ఓ సందర్భంలో ‘వెధవ’ అని కూడా అభివర్ణించారు.
గత కొంతకాలంగా టీడీపీ – వైసీపీ మధ్య విమర్శలు అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకున్న విషయం విదితమే. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో విమర్శలు చేసుకుంటున్నాయి రెండు పార్టీలు. మాజీ మంత్రి కొడాలి నాని, నారా లోకేష్ మీద చేస్తున్న విమర్శలు.. వాటికి కౌంటర్ ఎటాక్ అన్నట్లు టీడీపీ నేతలు.. వీటిపై మళ్ళీ టీడీపీ విమర్శలు.. వెరసి, రోజురోజుకీ విమర్శల స్థాయి మరింత దిగజారిపోతోంది.