RGV : ఆర్జీవీ ఫైర్: చంద్రబాబూ పబ్లిసిటీ కోసం జనాన్ని చంపేస్తావా.?
NQ Staff - January 5, 2023 / 10:57 AM IST

RGV : ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఒక్కసారిగా రాజకీయ నాయకుడైపోయాడు. రాజకీయ విమర్శలు చేసేశాడు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ‘నువ్వు’ అంటూ సంబోధిస్తున్నట్లు పేర్కొన్నాడు.
రాజకీయ నాయకులకు వుండాల్సిన కనీస లక్షణం చంద్రబాబులో లేదన్న ఆర్జీవీ, ఇరుకు సందుల్లో సభలు పెడితే ప్రమాదాలు జరుగుతాయని తెలియదా.? అని ప్రశ్నించాడు.
కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు..
కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు.. కానుకల పేరుతో ప్రజల్ని రప్పించి, వారిని బలిపెడతారా.? అని కందుకూరు, గుంటూరుల్లో జరిగిన తొక్కిసలాటలపై చంద్రబాబుని ఆర్జీవీ నిలదీశాడు.
హిట్లర్ వాంటి వాళ్ళతో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు అనీ, రాజకీయాల్లో డబ్బు, మద్యం పంచి జనాన్ని రప్పించడం చంద్రబాబే అలవాటు చేశారని ఆర్జీవీ ఆరోపించాడు.
రాజకీయ నాయకుడంటే ప్రజల భద్రత గురించి ఆలోచించాలనీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని చెప్పుకునే చంద్రబాబు ఇంతలా దిగజారడమేంటని ఆర్జీవీ ప్రశ్నించాడు.
ఈ మేరకు ఆర్జీవీ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది.
నర హంతకుడు నారా చంద్ర బాబు నాయుడు మీద ఆర్.జీ.వి కామెంట్స్
1/3 pic.twitter.com/Itc6MsTrLS— ????? ?? (@Gjkiran20) January 5, 2023
3/3 pic.twitter.com/s3YcBDuDsT
— ????? ?? (@Gjkiran20) January 5, 2023