Bendapudi Students : మన బెండపూడి రత్నాలను చూసేందుకు వచ్చిన ఆస్ట్రేలియన్‌ పంతులమ్మ

NQ Staff - September 27, 2022 / 04:16 PM IST

Bendapudi Students  : మన బెండపూడి రత్నాలను చూసేందుకు వచ్చిన ఆస్ట్రేలియన్‌ పంతులమ్మ

Bendapudi Students  : ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉన్న బెండపూడి గ్రామం ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడే విధానం కు ప్రతి ఒక్క రు కూడా నోరు వెళ్ళబెట్టాల్సిందే.

అమెరికన్ స్లాంగ్ లో వారు మాట్లాడే మాట

తీరు ఎంతో మందికి ఆదర్శనీయం అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెండపూడి తరహాలో ఏపీలోని అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ బోధన జరగాలని సంకల్పించింది.

పలు రాష్ట్రాలకు చెందిన విద్యాధికారులు బెండపూడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియన్ టీచర్ ఒకరు బెండపూడి విద్యార్థులను కలిసి వారితో మాట్లాడి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వారు మాట్లాడే అమెరికన్ స్లాంగ్ విని ఆమె ఆశ్చర్యపోయారు, వారికి అమెరికన్ స్లాంగ్ నేర్పించిన మాస్టర్ ప్రసాద్ తో కూడా ఆమె మాట్లాడింది, విద్యార్థులకు ఇంగ్లీష్ అంతగా ఎలా నేర్పించారు అనే విషయాన్ని ఆమె అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్ కు చెందిన వినోద్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. అక్కడే స్థానిక టీచర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఆ జంట హైదరాబాద్ వచ్చారు.. ఆ సమయంలో వినోద్‌ భార్య అయిన ఆస్ట్రేలియన్ టీచర్‌ కాకినాడలో ఉన్న బెండపూడి ఉన్నత పాఠశాలకు వెళ్లి అక్కడ విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటించి వారిని అభినందించారు.

ప్రస్తుతం బెండపూడి విద్యార్థిని విద్యార్థులతో ఆస్ట్రేలియన్ టీచర్ సాగించిన మాటామంతి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా బెండపూడి తరహా ఆంగ్ల భోదన జరిగితే బాగుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Andhra pradesh in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us