YS Jagan: స‌తీమ‌ణితో ఐదు రోజుల యూర‌ప్ ట్రిప్…స‌డెన్ ట్రిప్ వెనుక కార‌ణం ఏంటో తెలుసా?

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌రోనా వ‌ల‌న గ‌త‌కొద్ది రోజులుగా ప‌లు కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్, సెకండ్ వేవ్ స‌మ‌యంలో తాను అల‌ర్ట్‌గా ఉంటూ అధికారుల‌తో కూడా క‌రోనా నివార‌ణ‌కు సంబంధించి ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయితే తాను ఓ ఐదు రోజుల పాటు వీట‌న్నింటికి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో విదేశీ టూర్ వేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Reason Behind YS Jagan Europe Trip
Reason Behind YS Jagan Europe Trip

ఈ నెల 28 వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెళ్లి రోజు. ఆగ‌స్ట్ 28, 1996న భార‌తిని వివాహం చేసుకోగా, ఈ ఏడాదికి 25 ఏళ్లు నిండ‌నుంది. ఈ క్ర‌మంలో త‌న ఫ్యామిలీతో ఆ రోజుని స‌ర‌దాగా ఎంజాయ్ చేయాల‌ని భావించిన జ‌గ‌న్ 5 రోజుల పాటు యూర‌ప్ ట్రిప్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

సిల్వర్ జూబ్లీ దినోత్సవం సందర్భంగా జ‌గ‌న్ ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు యూర‌ప్‌లో చ‌క్క‌ర్లు కొట్టున్నారు. సిమ్లా లేదా డెహ్రాడూన్ ప్రాంతాల్లో గడపేందుకు వెళ్ళనున్నారు అని కొంత మంది చెబుతున్నారు. ప్ర‌త్యేక‌ విమానం లో వెళ్లాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మ‌రి ఇందుకు సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

కాగా, నిన్న జ‌రిగిన రాఖీ వేడుక‌ల‌లో జ‌గ‌న్ ఉత్సాహంగా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఆయనకు రాఖీ కట్టారు.డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, విడదల రజిని, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, కళావతి, నాగులాపల్లి ధనలక్ష్మి జగన్ కు రక్షాబంధన్ కట్టారు.సీఎం జ‌గ‌న్‌కు స్వీట్ తినిపించి అనంత‌రం ఆయ‌న‌తో సెల్ఫీలు కూడా దిగారు.-2-95832