Rapaka Vara Prasad : నేను దొంగ ఓట్లతోనే గెలిచా.. రాపాక వర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..
NQ Staff - March 27, 2023 / 01:23 PM IST

Rapaka Vara Prasad : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పెద్ద బాంబు పేల్చారు. తాను దొంగ ఓట్లతోనే గెలిచానంటూ చెప్పడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఒక రకంగా ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నేను దొంగోట్లతోనే గెలిచాను. మా ఊరిలో నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేశారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. గతంలో కూడా ఇలా దొంగ ఓట్లు వేయడంతో నాకు 800 ఓట్ల మెజార్టీ వచ్చింది అంటూ వ్యాఖ్యానించారు రాపాక. దాంతో ఆయన చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.
రాపాక మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు. ఇక నిన్న ఆయన టీడీపీ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కొనేందుకు టీడీపీ పార్టీ రూ.10 కోట్ల ఆశ చూపించారంటూ ఆరోపించారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్ల మీద ఒక్కొక్కొరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.