rammohan naidu : ఎంతో కీలకమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రతి ఒక్క ఎంపీ కూడా హాజరు అయ్యి తమ అభిప్రాయంను వెళ్లడించాల్సి ఉంది. ఒక రోజు కాకున్నా ఒక్క రోజు అయినా పార్లమెంట్ సమావేశాలకు హాజరు అవ్వాలంటూ పదే పదే పార్టీలు ఎంపీలకు ఆదేశాలు ఇస్తూ ఉంటాయి. పార్లమెంట్ సమావేశాల్లో అత్యంత చక్కగా పాల్గొనడంతో పాటు ప్రజా సమస్యలపై తన గళం ఎత్తి ఎక్కువగా మాట్లాడుతాడు అంటూ తెలుగు దేశం పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుకు ఉంది. ఇప్పటికే ఆయనకు చిన్న వయసులోనే సంసద్ రత్న పురష్కారం దక్కింది. పార్లమెంట్ కు ఖచ్చితంగా వచ్చి ఎక్కువగా ప్రజా సమస్యలపై చర్చించే వారికి ఈ అవార్డును ఇస్తారు. పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు అయ్యే రామ్మోహన్ నాయుడు బడ్జెట్ సమావేశాలకు 9 రోజుల పాటు హాజరు కాలేను అంటూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి తెలియజేశారు.

తన భార్య శ్రావ్య ప్రస్తుతం డెలవరీకి ఉంది. ప్రసవంకు ముందు ప్రసవం తర్వాత తాను ఆమెతో గడిపేందుకు 9 రోజులు సెలవు ఇవ్వాలని, ఆ 9 రోజుల సెలవులను పితృత్వ సెలవులుగా పరిగణించాలంటూ స్పీకర్ కు రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పీకర్ ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడుకు సెలవులు మంజూరు చేస్తారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో కూడా చక్కగా పాల్గొనడంతో పాటు తనదైన శైలిలో మాట్లాడుతూ ఆకట్టుకునే రామ్మోహన్ నాయుడు సెలవు కోరాడు అంటే అది జెన్యూన్ కారణం అయ్యి ఉంటుందని స్పీకర్ భావిస్తూ ఉంటాడు. అయితే ఈ కీలకమైన పార్లమెంట్ సమావేశాలకు రామ్మోహన్ నాయుడు గైర్హాజరు కావడం పట్ల వైకాపా నాయకులు కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఇక రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీ విషయానికి వస్తే.. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ చిన్న కుమార్తె శ్రావ్యను రామ్మోహన్ నాయుడు పెళ్లి చేసుకున్నాడు. ఎర్రం నాయుడు బండారు సత్యనారాయణ ఆప్త మిత్రులు. అలా ఇద్దరి మద్య బందం ఏర్పడింది. దాదాపు మూడు ఏళ్ల క్రితం రామ్మోహన్ నాయుడు మరియు శ్రావ్యల వివాహం అయ్యింది. ఎంపీగా పెళ్లి కొడుకు అయిన వారిలో రామ్మోహన్ నాయుడు ఒకరిగా నిలిచారు. ఇప్పుడు ఆయన తండ్రిగా ప్రమోషన్ దక్కించుకోబోతున్నారు. దాంతో ఇప్పుడు ఎర్రం నాయుడు జన్మించబోతున్నట్లుగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.