Ram Gopal Varma : వారాహి కాదు పంది బస్సు అంటూ ఆర్జీవీ సెటైర్లు.. పీకే ఫ్యాన్స్ ఫైర్..!
NQ Staff - January 25, 2023 / 12:49 PM IST

Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తాడో చెప్పడం చాలాకష్టం. ఆయన నోటికి ఏం వస్తే అదే మాట్లాడుతాడు. అవతలి వారు ఏం అనుకుంటారో అనేది కూడా అస్సలు ఆలోచించడు. ఇక మరీ ముఖ్యంగా పవన్ మీద ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉంటాడు. ఇక తాజాగా ఆయన పవన్ కల్యాణ్ ఎంతో ఇష్టంగా చేయించుకున్న వారాహి బండి మీద పడ్డాడు.
నిన్న పవన్ కల్యాణ్ తన వారాహి బండికి కొండగట్టులో పూజ చేయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్జీవీ కొన్ని ట్వీట్లు వదిలాడు. ‘‘గుడిలో ఉంటే అది ‘వారాహి’.. రోడ్డు మీద ఉంటే అది ‘పంది’.. పీ, తన పందికి ‘వారాహి’ అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే’’ అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి.

Ram Gopal Varma Tweeted On Pawan Kalyan Varahi Vehicle
ఆర్జీవీ ట్వీట్లు..
వెంటనే వాళ్ల నోర్లు మూయించక పోతే మన పవిత్ర ‘వారాహి’ని ఒక ‘పంది బస్సు’గా ముద్ర వేస్తారు. జై పీకే.. జై జనసేన అంటూ రాసుకొచ్చాడు ఆర్జీవీ. ఆయన ట్వీట్ చూస్తుంటే పీకేను పొగిడిన దాని కంటే సెటైర్లు వేసిందే ఎక్కువగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఇక మరో ట్వీట్ లో డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi (పంది బస్సు వారాహి) హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి.’’ అంటూ కామెంట్లు చేశాడు. ఆయన ట్వీట్లపై జనసైనికులు మండి పడుతున్నారు. వారాహి అంటే అమ్మవారు అని అలాంటి పవిత్రమైన పేరును ఇలా కామెంట్లు చేస్తావా అంటూ ఆర్జీవీని తిట్టిపోసత్ఉన్నారు.
జనసైనికులార దయచేసి #PandhiBassuVaarahi హ్యాష్‌ట్యాగ్ ని promote chesthunna veedi meedha action theesukondi https://t.co/ennigyCBK4
— Ram Gopal Varma (@RGVzoomin) January 24, 2023