TDP: లోకేష్ అనే వైరస్ కి.. తారక్ మాత్రమే తగిన వ్యాక్సిన్..

TDP మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా వైరస్ సోకటం పై సెటైర్లు వేసిన మల్టీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నిన్న మంగళవారం ఏపీలోని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు. వాళ్లిద్దర్నీ కరోనా వైరస్ లోని రెండు వేరియెంట్లతో పోల్చారు. ఆ రెండు వైరస్ లకీ తగిన వ్యాక్సిన్ తారక్ (జూనియర్ ఎన్టీఆర్) మాత్రమేనని చురకలంటించారు. తెలుగుదేశం పార్టీ అనే శరీరం నారా లోకేష్ వైరస్ అనే ఒక ప్రమాదకరమైన సూక్ష్మజీవి బారిన ఘోరాతి ఘోరంగా పడిపోయిందని, ఆ జబ్బు తగ్గాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒన్ అండ్ ఓన్లీ వ్యాక్సిన్ తారక్ అని రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో భలే కామెడీ పూయించారు.

చస్తార్రోయ్..

‘‘టీడీపీ క్యాడర్ మొత్తానికి నేనిచ్చే సలహా ఒక్కటే. మీరంతా మోటుగా ఉండకండి. ఇకనైనా స్మార్ట్ గా మారండి. సూపర్ ఫాస్ట్ గా తారక్ అనే వ్యాక్సిన్ వేయించుకోండి. లేకపోతే చస్తార్రోయ్’’ అని రాంగోపాల్ వర్మ హెచ్చరించారు. నిన్న చంద్రబాబు పుట్టిన రోజు కాబట్టి ఆయనకు బర్త్ డే విషెస్ కూడా చెప్పారు. ‘‘సార్ చంద్రబాబు గారూ.. నాకు ఏపీ మ్యాప్ ఎంతకీ గుర్తుకు రావట్లేదు. కానీ.. మీ ఫేస్ మ్యాప్ అయితే ఈజీగా గుర్తుకొస్తోంది. మా భూమ్మీద మీ ప్రభావం ఎంతుందో దీన్నిబట్టి చెప్పొచ్చు. హ్యాపీ బర్త్ డే సార్. మై బిగ్గెస్ట్ విషెస్ టు యు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు శాశ్వతంగా జీవించి ఉండాలని, ఉంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే మిమ్మిల్ని, ఏపీని వేరు చేసి చూడలేను’’ అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

 

మోడీ సాబ్ కి కూడా..

దేశ ప్రధాని నరేంద్ర మోడీ గడ్డం పైనా రాంగోపాల్ వర్మ ఛలోక్తి విసిరారు. దాన్ని కరోనా వైరస్ పవర్ తో పోల్చారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 ఏప్రిల్ వరకు ఈ ఏడాది కాలంలో ఒక వైపు మోడీ సాబ్ గడ్డం పొడవు తగ్గుతుంటే మరో వైపు కొవిడ్-19 వైరస్ శక్తిసామర్థ్యం పెరుగుతుండటం ఆశ్చర్యకరంగా ఉంది అని ఇవాళ బుధవారం మధ్యాహ్నం జోక్ చేశారు. ప్రధాని మోడీ నిన్న జాతినుద్దేశించి ప్రసంగించిన నేపథ్యంలో వర్మ ఇలా రియాక్ట్ అయుంటారని భావిస్తున్నారు.

Advertisement