Vishakhapatnam : విశాఖ రైల్వే జోన్ సంగతి ఏమైంది.?

NQ Staff - August 9, 2022 / 05:00 AM IST

Vishakhapatnam : విశాఖ రైల్వే జోన్ సంగతి ఏమైంది.?

Vishakhapatnam : ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన నేపథ్యంలో, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాల్సి వున్నా, ఆ రైల్వేజోన్ వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. నిజానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కోసం ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు జరిగాయి. విభజన తర్వాత కూడా ఆ ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి.

Railway Zone for Vishakapatnam still as dream

Railway Zone for Vishakapatnam still as dream

ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికలకు ముందు విశాఖ వచ్చినప్పుడు, విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన చేశారు. నిజానికి, ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’ పేరుతో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ మీద ప్రకటన ఎప్పుడో వచ్చింది. అయితే, ఆ రైల్వే జోన్ ఇంతవరకూ అమల్లోకి రాలేదంతే.

త్వరలో, అతి త్వరలో..

కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి ఎనిమిదేళ్ళ సమయం సరిపోకపోవడం శోచనీయమే. పైగా, జోన్ ఏర్పాటుుకు సంబంధించి ప్రకటన వచ్చాక కూడా, పనులు ముందుకు జరగలేదు. లాభసాటి మార్గాన్ని విశాఖ డివిజన్ నుంచి దూరం చేసి, ఎందుకూ పనికిరాని రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలూ వున్నాయి.

తాజాగా, రాజ్యసభలో రైల్వే జోన్ అంశం ప్రస్తావనకు వస్తే, ‘డీపీఆర్ కూడా ఆమోదించాం.. త్వరలోనే తీపి కబురు..’ అంటూ కేంద్రం సమాధానమిచ్చింది. ఎన్నాళ్ళు.? ఇంకెన్నేళ్ళు.? ఇంకో ఏడెనిమిదేళ్ళ తర్వాత అయినా, విశాఖ రైల్వే జోన్ అనే కల సాకారమవుతుందో లేదో.?

కాంగ్రెస్ హయాంలో విభజన చట్టంలో ‘పరిశీలన’ అని మాత్రమే పేర్కొనడంతోనే ఈ సమస్య.. అన్న వాదనా లేకపోలేదు.

Read Today's Latest Andhra pradesh in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us