Raghu Rama Krishna Raju: ‘‘రాజు’’ కాదు.. జోకర్..

Raghu Rama Krishna Raju అధికారికంగా వైఎస్సార్సీపీ ఎంపీ. అనధికారికంగా ఏ పార్టీ లీడరో ఆయనకే తెలీదు. రోజూ ఎల్లో మీడియాలో కనిపిస్తాడు. నియోజకవర్గ ప్రజలకి మాత్రం కనిపించడు. పేరులో రాజు అనే తోక ఉంది కదా. అందుకే రాజకీయంగా తనకితాను రారాజు అని ఫీల్ అవుతుంటాడు. కానీ పొలిటికల్ జోకర్ గా మిగిలిపోతున్నానని మాత్రం గ్రహించట్లేదు. పొద్దుకు మూడు పూటలా తిని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మూడు సార్లు తిట్టడమే ఆయన పని. ఆయన ఎవరో మీకు ఇప్పటికే క్లియర్ కట్ గా అర్థమై ఉంటుంది. రఘురామకృష్ణరాజు. నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు. పేరు ఎంత పెద్దగా ఉందో మనిషి కూడా అంత భారీ కాయుడు. బొర్ర పెంచాడు కానీ బుర్ర పెంచలేదని జనం అనుకుంటున్నారు.

ఏపీలోకి రాకున్నా.. ఏమీ కాదు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాముడో రావణుడో తేలే వరకు ఏపీలో కాలు, వేలు పెట్టనని రఘురామకృష్ణరాజు ఇవాళ బుధవారం భలే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఆ రాష్ట్రానికి వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? రఘురామకృష్ణరాజు ఎక్కడున్నా చేసేది ఒకటే. జగన్ ని తిట్టడం. ఆ మాత్రం దానికి ఢిల్లీలో ఉన్నా గల్లీలో ఉన్నా నో ప్రాబ్లం. పైగా అతనొక మామూలు యజ్ఞం చేయట్లేదంట. మహాయజ్ఞం చేస్తున్నాడట. అదే మరి బిల్డప్ అంటే. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేయటమేనా ఆ మహాయజ్ఞం అని విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు.

ఆ మాత్రం తెలియదా?..

జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ప్రొసీడింగ్స్ సరిగా లేవంటూ సీబీఐ కోర్టు తీడ్చికొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇవ్వాలంటూ చురకలంటించిందని సమాచారం. వైఎస్సార్సీపీకి, జగన్ కి రోజూ సవాలక్ష హిత వాక్యాలు పలికే ఆయనకి అసలు వ్యాజ్యం ఎలా వేయాలో కూడా తెలియదా అని ఏపీలోని రూలింగ్ పార్టీవాళ్లు లాజిక్ పాయింట్ లాగుతున్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీ(అది ఏ పార్టీయో?)కి చెడ్డ పేరు రాకుండా ఉండాలనే తాను ఈ పిటిషన్ వేశానని రఘురామకృష్ణరాజు కలరింగ్ ఇస్తున్నాడు. పార్టీ నచ్చకపోతే రాజీనామా చేయాలి గానీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం దేనికి అని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆయన వెనక ప్రధాని మోడీ ఉన్నాడంట. అంటే రఘురామకృష్ణరాజు చేత ఇలాంటి చిలక, చిల్లర పలుకులు పలికిస్తున్నది కమలం పార్టీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆట బాగుంటే కింగే..

పేకాటలో జోకర్ కార్డు అని ఒకటి ఉంటుంది. ఆట బాగున్నప్పుడు, షో కొట్టే ఛాన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కడైనా వాడుకోవచ్చు. విలువ పెరుగుతుంది. కానీ, ఏపీలో కాషాయం పార్టీకి పొలిటికల్ గేమ్ ప్లే చేసే స్పేసే లేదు. అలాంటప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి జోకర్ కార్డులను ఎన్ని పెట్టినా మొద్దాట లాగే మొహం కొడుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కేసులో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఓడిపోవటం ఖాయమని ఆయన సెలవిచ్చిన కొద్ది క్షణాల్లోనే న్యాయ స్థానం జగన్ సర్కార్ కి గ్రీన్ సిగ్నల్ వేసింది. ఇదీ రఘురామకృష్ణరాజు ఫ్యూచర్ నాలెడ్జ్.

Advertisement