RaghuRama : గాయపడ్డ సింహమంట.. శ్వాస సైతం గర్జన కన్నా భయంకరమంట..

RaghuRama : మనం ఏమో అనుకుంటాం గానీ సమాజంలో చాలా భిన్నమైన, విచిత్రమైన వ్యక్తులు కనిపిస్తుంటారు. తప్పు చేసిన వ్యక్తికి కూడా అభిమానులు ఉంటారు. బహుశా వాళ్లనే పిచ్చి ఫ్యాన్స్ అంటారేమో. ఇదంతా ఎందుకంటే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కొందరు గాయపడ్డ సింహంతో పోల్చారు. ఆయన శ్వాస తీసుకున్నా కూడా అది గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని ఓ రేంజ్ లో చెప్పుకొస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ సినిమాటిక్ డైలాగులను ఒక నినాదంగా భావించి, వాటిని ఫ్లెక్సీ మీద ప్రింట్ చేయించి ప్రదర్శించారు. అసలే ఆ ఎంపీ సమాజంలో వివిధ వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాడంటూ ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసేవాళ్లను పోలీసులు ఊరుకుంటారా?..

RaghuRama : mp raghuramakrishanraju fans actions
RaghuRama : mp raghuramakrishanraju fans actions

ఏం చేశారు?..

ఆ ఫ్లెక్సీలను ఎవరైతే ఏర్పాటుచేశారో వాళ్లను పిలిపించి, వాళ్ల చేతే వాటిని తొలగింపజేశారు. ముల్లును ముల్లుతోనే తీయటం అంటే ఇదే. ఈ వ్యవహారం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు రోజుల కిందట లోకల్ క్షత్రియ యూత్ మెంబర్స్ చేసిన ఈ తతంగాన్ని పోలీసులు తమదైన శైలిలో చక్కబెట్టారు. వాళ్లు కట్టిన మూడు ఫ్లెక్సీలను తెలివిగా తీసేయించారు. దీంతో నిందితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ నే ముట్టడించారు. దీన్నిబట్టి రఘురామకృష్ణరాజును ఇష్టపడే వ్యక్తులు కూడా అతని మాదిరిగానే దురుసుగా ప్రవర్తిస్తారని, సర్కారును కూడా లెక్కచేయరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తర్వాత ఏమైంది?..

పోలీస్ స్టేషన్ ను రౌండప్ చేసిన క్షత్రియ యూత్ మెంబర్స్ ఎస్ఐ అందుబాటులో లేకపోవటంతో అతనికి ఫోన్ చేసి మాట్లాడారు. తాను వేరే పనిలో బిజీగా ఉన్నానంటూ సదరు సబ్ ఇన్ స్పెక్టర్ సమాధానం చెప్పాడు. రేపొద్దున వస్తే మాట్లాడతానని చెప్పి పంపించేశాడు. ఎస్ఐ గారూ ఎందుకిలా చేశారని మీడియా అడిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చాకచక్యంగా వివరణ ఇచ్చాడు. ఇదీ సంగతి. రఘురామకృష్ణరాజు పుట్టిన రోజు నాడు కూడా నారా కోడూరు యూత్ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయటం, అదే రోజు ఆయన్ని జగన్ సర్కారు అదుపులోకి తీసుకోవటం గమనార్హం.