Purandeswari : జగన్ విషయంలో అలా.. బాబు విషయంలో ఇలా.. పురంధేశ్వరికి అసలు చిత్తశుద్ధి ఉందా..?

NQ Staff - November 2, 2023 / 11:57 AM IST

Purandeswari : జగన్ విషయంలో అలా.. బాబు విషయంలో ఇలా.. పురంధేశ్వరికి అసలు చిత్తశుద్ధి ఉందా..?

Purandeswari :

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియామయం అయిన పురంధేశ్వరి చాలా విషయాల్లో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు లాగానే జగన్ మీద లేనిపోని ఆరోపణలు చేసి బురద జల్లాలని చూస్తోంది. అదే సమయంలో డైరెక్ట్ గా చంద్రబాబుతో పొత్తులు పెట్టుకోకపోయినా.. ఆమె మాటలు, చేష్టలు మాత్రం టీడీపీకి సపోర్టుగానే ఉంటున్నాయి. ఇప్పటికే ఆమె ఇలాంటివి చాలా విషయాలు మాట్లాడింది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరుగుతున్నాయని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది.

అయితే ఆమె కామెంట్లు, ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం పెద్దగా స్పదించకపోవడంతో మరింత రెచ్చిపోయింది. కానీ ఆమెకు కోలుకోలేని షాక్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 వరకు మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని బేవరేజెస్ కంపెనీ ఎండీ వాసుదేవ రెడ్డి ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కేసులో చంద్రబాబును ఏ-3 నిందితుడిగా పరిగణిస్తూ కేసులు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఇక్కడే పురంధేశ్వరి మళ్లీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు చంద్రబాబు మీద నమోదైన ఏ ఒక్క కేసు గురించి కూడా ఆమె స్పందించట్లేదు.

ఇప్పుడు చంద్రబాబుపై సీఐడీ స్వయంగా మద్యం అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు చేస్తే దానిపై కూడా కామెంట్ చేయట్లేదు. ఆమె ఎందుకు ఇలా మౌనంగా ఉంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు. నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఇదే చంద్రబాబు మీద కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేయాలి. అంతే గానీ జగన్ ఎలాంటి కేసులు నమోదు కాక ముందే ఫిర్యాదులు చేసినప్పుడు.. చంద్రబాబు ఏకంగా కేసులు నమోదైనప్పుడు కేంద్ర సంస్థలతో దర్యాప్తులు చేయాలంటూ ఆమె కూడా ఫిర్యాదులు చేయాలి కదా. కానీ అలా చేస్తే ఆమెకు చిత్తశుద్ధి ఉన్నటుంది అవుతుంది కదా.

Purandeswari Supporting Chandrababu

Purandeswari Supporting Chandrababu

అందుకే అలా చేయకుండా తనకు చిత్తశుద్ధి లేదని క్లియర్ గా నిరూపించుకుంటోంది. ఎంతైనా తన మరిది అనే సానుభూతి ఆమెలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇలా చంద్రబాబును వెనకేసుకు వస్తోంది. అదే సమయంలో అటు జగన్ మీద మాత్రం లేనిపోని ఆరోపణలు చేసి బద్నాం చేయాలని చూస్తోంది.

దీన్ని బట్టి ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా సమన్యాయం చేయట్లేదని బీజేపీ నేతలే ఆరోపిస్తున్నారు. తన సొంత చుట్టం అయితే ఒకలా.. ఇంకొకరు అయితే ఒకలా ప్రవర్తించడం ఏంటని భగ్గుమంటున్నారు. బీజేపీ అంటేనే కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకి కదా.. మరి ఇప్పుడు పురంధేశ్వరి చేస్తుంది ఏంటో చెబితే బాగుంటుంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us