Janasena : ఏపీలో యాత్రకు బస్సు రెడీ.! జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమేనా.?

NQ Staff - October 12, 2022 / 09:38 PM IST

Janasena : ఏపీలో యాత్రకు బస్సు రెడీ.! జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమేనా.?

Janasena : రాజకీయ యాత్రలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వాటి కోసం ప్రత్యేక వాహనాల్ని వినియోగించాల్సి వుంటుంది. బస్సు యాత్ర చేయాలంటే, అందుకు అనుగుణంగా బస్సుల్లో కీలక మార్పులు చేయక తప్పదు. వీటిని ఎన్నికల ప్రచార రధాలని అనుకోవచ్చు.

PSPK Janasena bus yatra very soon 3

PSPK Janasena bus yatra very soon 3

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓ ‘రధాన్ని’ సిద్ధం చేసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో అధికార పీఠమెక్కడమే లక్ష్యంగా త్వరలో పవన్ కళ్యాణ్, సుదీర్ఘంగా బస్సు యాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఏకబిగిన ఈ యాత్ర వుంటుందా.? దశల వారీగా యాత్ర జరుగుతుందా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

సినిమాలు ఓ వైపు.. రాజకీయం మరో వైపు…

‘హరిహర వీరమల్లు’ సినిమాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి చేయాలి. ఆ తర్వాత ‘వినోదయ సితం’ సినిమా రీమేక్ చేయాల్సి వుంది. కానీ, ‘వినోదయ సితం’ సినిమా రీమేక్ వెనక్కి వెళ్ళేలా వుంది. ‘హరిహర వీరమల్లు’ మాత్రం వీలైనంత వేగంగా పూర్తి చేసేయాలనే లక్ష్యంతో వున్నారు పవన్ కళ్యాణ్.

PSPK Janasena bus yatra very soon 3

PSPK Janasena bus yatra very soon 3

ఇంకోపక్క, తన ప్రచార యాత్రకు సంబంధించి రధాన్ని జనసేనాని సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్, ఆ వాహనాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఆ వాహనానికి చిన్న చిన్న మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా నిపుణులు చేస్తున్నారట.

బస్సులో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకోవడానికి, ఓ పదిమందితో బస్సులోనే సమావేశాలు నిర్వహించడానికీ.. వీటికి తోడుగా బస్సు టాప్ పైనుంచి ప్రసంగాలు చేసేందుకూ.. ఇలా అన్ని కోణాల్లోనూ ఆలోచించి, అత్యాధునికంగా ఈ బస్సుని తీర్చిదిద్దుతున్నారు. ఆ బస్సుకు సంబంధించి, పవన్ కళ్యాణ్ ఆ బస్సుని పరిశీలించడానికి సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

PSPK Janasena bus yatra very soon 3

PSPK Janasena bus yatra very soon 3

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us