Janasena Party : జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత
NQ Staff - June 12, 2023 / 07:58 PM IST

Janasena Party : జనసేన పార్టీలో మెల్ల మెల్లగా చేరికలు మొదలు అవుతున్నాయి. ఇండస్ట్రీ నుండి జనసేన పార్టీకి మద్దతు దక్కడం లేదు అనుకుంటూ ఉండగా ఇటీవలే హైపర్ ఆది తో పాటు మరి కొందరు జనసేన పార్టీ కి జై అంటూ మద్దతు పలికిన విషయం తెల్సిందే. తాజాగా జనసేన పార్టీ లో ప్రముఖ నిర్మాత జాయిన్ అయ్యాడు.
గతంలో పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించడంతో పాటు ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆయన్ను పార్టీ కండువా కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్‌వీసీసీ బ్యానర్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఇటీవల విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా వరుసగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో మంచి కథలు ఎంపిక చేసుకుంటూ ఈయన ఎన్నో సినిమాలు నిర్మించారు.

Producer BVSN Prasad Joined Janasena Party
ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పేరు దక్కించుకున్న బివిఎస్‌ఎన్ ప్రసాద్ రాజకీయాల్లో మొదటి సారి జనసేన పార్టీ ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో అంతా కూడా ఈయన రాజకీయ జర్నీ ఎలా ఉంటుందో అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన వారు ముందు ముందు మరింత మంది జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.