Priyamani : ఏపీ ప్రభుత్వానికి ప్రియమణి స్పెషల్ రిక్వెస్ట్

Priyamani : టాలీవుడ్ సీనియర్ నటి, ‘ఢీ’ డ్యాన్స్ షో జడ్జి ప్రియమణి ఇవాళ మంగళవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాటలో నడిచారు. కరోనా రెండోసారి కోరలు చాస్తున్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలని కోరారు. ఈ మేరకు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెద్ద నోట్ పెట్టారు. హీరోయిన్ ప్రియమణి ఇలా ఒక సామాజికాంశంపై ప్రభుత్వానికి రిక్వెస్ట్ పంపటం బహుశా ఇదే తొలిసారి అయుంటుంది. తద్వారా ఆమె ఈ రోజు ప్రముఖంగా వార్తల్లో నిలిచారు.

ఏం రాశారు?..

‘‘ప్రియమైన ఏపీ గవర్నమెంట్ కి నేను మనస్ఫూర్తిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుతం నెలకొన్ని అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో.. కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడుతండటంతో.. బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తారని ప్రతిఒక్కరూ మీ వైపు ఎదురు చూస్తున్నారు. అందువల్ల దయచేసి ఈ దిశగా మంచి నిర్ణయం తీసుకొని లక్షల మంది విద్యార్థులు సురక్షితంగా ఉండేలా చూడండి. పిల్లల పరీక్షల కన్నా వాళ్ల ప్రాణాలు మిన్న’’ అని ప్రియమణి తన పోస్టులో పేర్కొన్నారు.

Priyamani : senior heroine priyamani special request to ap govt
Priyamani : senior heroine priyamani special request to ap govt

ప్రభుత్వం ఏమంది?: Priyamani

ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్న సోమవారం మాట్లాడుతూ 1 నుంచి 9వ తరగతి వరకు క్లాసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జూన్ 6 నుంచి 16 వరకు నిర్వహించతలపెట్టిన ఎస్సెస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ లో మాత్రం ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే.. సర్కారు టైం టేబుల్ ప్రకారం టెన్త్ ఎగ్జామ్స్ కి ఇంకా రెండు నెలల టైం ఉంది. ఈ లోపు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. మరీ ప్రమాదకరంగా ఉంటే ప్రభుత్వం కూడా గుడ్డిగా పరీక్షలు పెట్టదు. కాకపోతే పవన్ కళ్యాణ్, ప్రియమణి లాంటి కొందరు వ్యక్తులు ఆందోళనతో ముందుగానే పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వాళ్ల పేరెంట్స్ తరఫున కోరుతున్నారు.

కింగ్స్ వర్సెస్ క్వీన్స్

ప్రియమణి ప్రస్తుతం ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ పేరుతో ఓ టీవీ ఛానల్ లో ప్రసారయ్యే పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా పాల్గొంటున్న విషయం విధితమే. ఆమెతోపాటు శేఖర్ మాస్టర్, షామ్నా ఖాసిం(పూర్ణ) కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. దీనికి హోస్ట్ ప్రదీప్. ఇందులో రష్మీ గౌతమ్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, వర్షిణీ సౌందరరాజన్ తదితరులు మెరుస్తున్నారు. ప్రియమణి విక్టరీ వెంకటేష్ తో కలిసి హీరోయిన్ గా నటిస్తున్న నారప్ప మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. అలాగే విరాటపర్వం చిత్రంలోనూ నటించారు.

Advertisement