BrahMoney Pay : ‘బ్రా’హ్‘మనీ’ పే.! తాజ్ హోటల్ బిల్లులు అనుమతించబడును.!

NQ Staff - September 28, 2022 / 04:20 PM IST

BrahMoney Pay : ‘బ్రా’హ్‘మనీ’ పే.! తాజ్ హోటల్ బిల్లులు అనుమతించబడును.!

BrahMoney Pay : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజురోజుకీ ‘జుగుప్స’ ఎక్కువైపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతికి లిక్కర్ మాఫియాతో సంబంధం వుందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ‘భారతి పే’ అంటూ పోస్టర్లు వెలిశాయి. కర్నాటకలో ‘పే సీఎం’ పోస్టర్లు, సీఎం బొమ్మైకి వ్యతిరేకంగా పుట్టుకొస్తే, అదే దారిలో లిక్కర్ మాఫియా ఆరోపణలతో ‘భారతి పే’ అంటూ పోస్టర్లను తయారు చేశారు.

అయితే, వైసీపీలోనే ఓ వర్గం, తమ అధినేత సతీమణి మీద ఈ తరహా కుట్ర పని వుండొచ్చన్న అనుమానాలూ లేకపోలేదు. ఆ సంగతి పక్కన పెడితే, ‘భారతి పే’ వివాదానికి కౌంటర్ ఎటాక్ ఇస్తోంది వైసీపీ. ‘బ్రా’హ్‘మనీ’ పే.. అంటూ పోస్టర్ డిజైన్లను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.

తాజ్ హోటల్ బిల్స్ అనుమతించబడును..

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు, మాజీ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె కూడా.! లిక్కర్ మాఫియా ఆరోపణలు భారతి మీదనే కాదు, బ్రాహ్మణి మీద కూడా వినిపించాయి ఏపీ రాజకీయాల్లో.
రాజకీయాల్లో ఆరోపణలు సహజమే కావొచ్చుగాక.

కానీ, పేర్లను అత్యంత జుగుప్సాకరంగా మార్చి, పోస్టర్లను తయారు చేయడం క్షమార్హం కాదు. వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయమంటేనే అందరూ చీదరించుకునేలా ఇరు పార్టీలూ వ్యవహరిస్తున్నాయి.
రెండు ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టుపట్టిస్తున్న వైనం అత్యంత దారుణం.

Read Today's Latest Andhra pradesh in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us