Posani Krishna Murali : తర్వాత సీఎం జూనియర్ ఎన్టీఆరే.. పోసాని కృష్ణమురళి కామెంట్లు..!
NQ Staff - March 11, 2023 / 04:07 PM IST

Posani Krishna Murali : చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ చర్చ నడుస్తోంది. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ చాలామంది కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే ర్యాలీలు, నిరసనలు కూడా చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లాంటి వారు ఎక్కడకు వెళ్లినా సరే సీఎం ఎన్టీఆర్ అంటూ నానా హంగామా చేస్తున్నారు జూనియర్ ఫ్యాన్స్.
ఇప్పుడు టీడీపీని నడిపించే నాయకుడు లేడని.. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీని హస్తగతం చేసుకుంటే.. ఆయనే కచ్చితంగా సీఎం అవుతారని చెబుతున్నారు విశ్లేషకులు. కాగా తాజాగా ఇదే విషయంపై సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా స్పందించారు. ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ దమ్ములేదు..
ఇందులో ఆయన మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టే దమ్ము టీడీపీకి గానీ, చంద్రబాబుకు గానీ లేదు. చంద్రబాబు ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిని తిడుతున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టగలరా.. వారికి ఆ దమ్ములేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరో.
జూనియర్ ఎన్టీఆర్ తో పెట్టుకుంటే ఆయన ఫ్యాన్స్ ఊరుకోరు. జూనియర్ తో మంచిగా ఉంటే ఆయన ఫ్యాన్స్ ఓట్లు అన్నీ కూడా తమకు పడుతాయని టీడీపీ భావిస్తోంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తలచుకుంటే తర్వాత సీఎం అయ్యే కెపాసిటీ ఉన్న వ్యక్తి. మోస్ట్ క్రౌడ్ పుల్లర్ అంటూ కామెంట్లు చేశాడు పోసాని కృష్ణ మురళి.