Ponguru Priya Sensational Comments On EX Minister Narayana : మాజీ మంత్రి నారాయణపై తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు.. బలవంతం చేస్తున్నాడంటూ..!

NQ Staff - July 29, 2023 / 09:52 AM IST

Ponguru Priya Sensational Comments On EX Minister Narayana : మాజీ మంత్రి నారాయణపై తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు.. బలవంతం చేస్తున్నాడంటూ..!

Ponguru Priya Sensational Comments On EX Minister Narayana

మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియా సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి నారాయణ మా ఆయన అన్నయ్య. గద్ద వచ్చి పిట్టను ఎత్తుకెళ్లినట్టు ఆయన నన్ను ఎత్తుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు.

నన్ను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఆయన భార్య ఉండగానే నేను అన్నం తీసుకురాలేదని నన్ను కొట్టాడు. అర్ధరాత్రులు టార్చర్ పెడుతున్నాడు. టిఫిన్ చేసే సమయం నుంచి సాయంత్రం దాకా నన్ను తిట్టడమే ఆయన పని. మా నాన్న వెంటపడి నన్ను ఆయన తమ్ముడికి చేసుకున్నారు.

ప్రచారం చేయమంటూ..

నాకు పెళ్లి అయిన మూడో రోజు నుంచే నరకం చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయాలంటూ టార్చర్ చేశారు. నాకు ప్రచారం చేయడం ఇష్టం లేదని చెప్పినా వినలేదు. ఆయన కళ్లు ఎప్పుడూ నా మీదనే ఉంటున్నాయి. ఆయన నుంచి తప్పించుకోవాలని ఎన్నో సార్లు ప్రయత్నం చేసినా ఫలితం లేదు.

Ponguru Priya Sensational Comments On EX Minister Narayana

Ponguru Priya Sensational Comments On EX Minister Narayana

మా ఇంట్లో వారికి ఈ విషయం చెప్పలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. నారాయణ అసలు రూపం ఇదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ప్రజలు. పైకి నీతులు చెప్పే నారాయణ.. ఇంత చెత్తగా ప్రవర్తిస్తారా అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us