PM Modi : టీడీపీతో పొత్తు: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రధాని మోడీ.?
NQ Staff - November 17, 2022 / 09:06 AM IST

PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల విశాఖలో పర్యటించిన సందర్భంలో మిత పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.
జనసేన – బీజేపీ మధ్య తెలంగాణలో పొత్తు ఎప్పుడో చెడింది. ఏపీలో కూడా ఈ బంధం వెంటిలేటర్ మీద వుందనే చెప్పాలి. మోడీతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘ఒక్క అవకాశం జనసేనకు ఇవ్వండి..’ అంటూ ప్రజల్లోకి వెళ్ళి నినదించిన సంగతి తెలిసిందే.
అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు అలా అంటున్నారు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ని మోడీ లైట్ తీసుకున్నారనే ప్రచారం జరిగింది, జరుగుతోంది కూడా.
టీడీపీతో పొత్తుకి మోడీ ససేమిరా అన్నారా.?
టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే వైసీపీని ఓడించగలమని ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ చెప్పారట. అయితే, టీడీపీతో కలిసి వెళ్ళడం కుదరదని మోడీ, పవన్ కళ్యాణ్‌కి తెగేసి చెప్పారట. అలాగని ప్రచారం జరుగుతోంది.
కానీ, బీజేపీ – జనసేన కలిసి పోటీ చేసినా, వైసీపీని ఎదుర్కోవడం కష్టం. వైసీపీని కాస్తో కూస్తో ఏపీలో నిలువరించగలిగే శక్తి టీడీపీకి మాత్రమే వుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ టీడీపీతో పొత్తుకి బీజేపీ ఒప్పుకోకపోతే, ఏపీపై బీజేపీ ఆశలు వదిలేసుకోవాల్సిందే.
ముగ్గురూ విడివిడిగా పోటీ చేస్తేనే, తమకు రాజకీయ లబ్ది అని వైసీపీ భావిస్తోంది.