Perni Nani : పవన్ కు వార్నింగ్ ఇచ్చిన పేర్ని నాని.. ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చూపిస్తానంటూ..

NQ Staff - June 15, 2023 / 01:05 PM IST

Perni Nani : పవన్ కు వార్నింగ్ ఇచ్చిన పేర్ని నాని.. ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చూపిస్తానంటూ..

Perni Nani : ఏపీలో పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న విషయం తెలిసిందే.. 2024 ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి.. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి పేరుతో యాత్ర స్టార్ట్ చేశారు.. ఈయన ఈ యాత్రలో అధికార పక్షం మీద ఆరోపణలు గుప్పించారు.. మరి ఈయన వార్తలను తిప్పి కొడుతూ మంత్రి పేర్ని నాని పవన్ పై సంచలన విమర్శలు చేసారు.

మీడియా సమావేశంలో భాగంగా రెండు చెప్పులు చూపిస్తూ నాని పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.. నువ్వు ఒక చెప్పు చూపిస్తే నేను నీ కంటే పెద్ద మొగోడిని నేను రెండు చెప్పులు చూపిస్తానని.. మక్కెలిరిగి పోతాయంటూ మండిపడ్డారు.. పవన్ కళ్యాణ్ ముందుగా జనసేన పార్టీ కార్యాలయంలో చెప్పు చూపించి వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే..

అదే విధంగా ఇప్పుడు ఆయనకు కౌంటర్ ఇస్తూ పవన్ పై విమర్శలు గుప్పించారు.. అలాగే అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి ఎన్ని వ్యూహాలైన పన్నుతానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనను ఎద్దేవా చేసారు.. గోదానం, భూదానం తరహాలోనే ముఖ్యమంత్రి పదవి కూడా దానం చేస్తారా అని అని ప్రశ్నించారు.. ఏది తనకు తానుగా రేడు శోధించి సాదించాలి.. అనే కొటేషన్ చెబుతూ జగన్ శోధించి సీఎం పదవిని సాధిస్తే పవన్ మాత్రం అడుక్కుంటున్నాడని పేర్ని నాని చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us