Pawan’s silence on Chandrababu’s IT notices : చంద్రబాబుకు ఐటీ నోటీసులపై పవన్ సైలెంట్.. ఎందుకో మరి..?

NQ Staff - September 4, 2023 / 09:56 AM IST

Pawan’s silence on Chandrababu’s IT notices  :  చంద్రబాబుకు ఐటీ నోటీసులపై పవన్ సైలెంట్.. ఎందుకో మరి..?

Pawan’s silence on Chandrababu’s IT notices  :  పవన్ కల్యాణ్‌ రాజకీయంగా చాలా నీతులు చెబుతుంటారు. పదే పదే జగన్ ను అవినీతి చేశాడని, అక్రమాలు చేశాడని ఆరోపిస్తూ ఉంటాడు. అవినీతి చేసేవారు రాజకీయాల్లో ఎలా ఉంటారు, ప్రజలను ఎలా పాలిస్తారని ఏవేవో డైలాగులు కొడుతుంటాడు. అంటే ఇప్పటి వరకు జగన్ మీద పవన్ చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపించలేదనుకోండి. కానీ పవన్ మాత్రం నీతి, నిజాయితీలను పదే పదే ప్రస్తావింటూ ఉంటాడు కదా.. మరి ఇప్పుడు చంద్రబాబు విషయంలో ఎందుకు స్పందించట్లేదు. అదేనండి మొన్న షాపూర్జీ పల్లోంజీ సంస్థకు చెందిన కన్సల్టెంట్ మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చెందిన సంస్థల్లో ఐటి అధికారులు దాడులు చేశారు కదా.

ఈ షాపూర్జీ పల్లోంజి సంస్థ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో పలు నిర్మాణాలు చేసింది. కాగా ఐటీ దాడుల్లో ఆయన ఇంట్లో దొరికిన ఓ చిన్న ఆధారాన్ని పట్టుకుని లాగితే తమకు గతంలో అధిక ధరలకు కాంట్రాక్టు పనులు ఇచ్చినందుకు చంద్రబాబు పార్టీ ఫండ్ కింత రూ.118 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో గత్యంతరం లేక ఆయన పీఏ శ్రీనివాస్‌కు ఆ ముడుపులు సమర్పించుకున్నారని తేలింది. ఈ ముడుపుల వ్యవహారంలో చంద్రబాబుకు సెక్షన్ 127,ఇంకా 153C సెక్షన్ల కింద ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు జరీ చేశారు.

కానీ చంద్రబాబు మాత్రం తనకు నోటీసులు ఇవ్వాల్సిన పద్ధతి ఇది కాదంటూ.. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టే వ్యవహరిస్తున్నారు. మరి ఇంత రచ్చ జరుగుతుంటే పవన్ కల్యాణ్‌ ఎందుకు నోరు మెదపట్లేదు. నీతి, నిజాయితీ అంటూ గప్పాలు కొట్టే పవన్ కల్యాణ్‌.. ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ సీఎం జగన్ కు ఐటీ అధికారులు నోటీసులు ఇస్తే.. ఈ పాటికి మైక్ పగిలిపోయేలా మొత్తుకునే వాడు. జగన్ అవినీతి, అక్రమాలు అంటూ చెవులు తూట్లు పడేలా అరిచేవాడు. కానీ చంద్రబాబు విషయంలో మౌనం ఎందుకు.

ఇదే విషయంపై వైసీపీ ట్విట్టర్ లో నేరుగా పవన్ ను ప్రశ్నించింది. కానీ పవన్ నుంచి మాత్రం సమాధానం లేదు. అటు జనసేన పార్టీ కూడా ఈ విషయంలో మౌనంగా ఉండిపోయింది. అంటే చంద్రబాబు ఏం చేసినా తప్పులేదన్నట్టు పవన్ వ్యవహరిస్తున్నాడన్నమాట. అంటే చంద్రబాబు అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నా సరే.. ఆయన రాజకీయాలు చేయొచ్చు, సీఎం అయినా తప్పులేదు. ఇదే పవన్ కల్యాణ్ విధానం అన్నమాట.

ఇందుకే పవన్ ను ప్రజలు అస్సలు నమ్మట్లేదు. ఏదైనా మాట్లాడితే ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అంతే తప్ప ఒకరి విషయంలో ఒకలా, మరొకరి విషయంలో ఇంకొకలా ఉంటే.. పవన్ ను ఇప్పటికే కాదు.. ఎప్పుడూ ఎవరూ నమ్మరు. ఆ విషయాన్ని గుర్తుంచుకుని పవన్ ముందుకు వెళితే బాగుంటుంది. లేదంటే చంద్రబాబు ఆడిస్తున్న ఆటలో పావుగా మిగిలిపోతాడు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us