Pawan kalyan : వెయ్యి కోట్ల ఆఫర్ పై చెప్పుదెబ్బలన్న పవన్.. అతనిని ఉద్దేశించే అన్నాడా..?
NQ Staff - March 15, 2023 / 12:08 PM IST

Pawan kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కల్యాణ్ మళ్లీ క్రియాశీల రాజకీయాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభను కృష్నా జిల్లా మచిలీ పట్నంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. చాలామంది నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు.
ఇప్పుడేమో కొత్త నినాదం ఎత్తుకున్నారు. నాకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు ఆఫర్ చేశారంటూ రాసుకొచ్చారు. ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటున్నాను. నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి గతంలోనే చెప్పు చూపించాను అంటూ సీరియస్ కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్. తాను డబ్బు మనిషిని కాదని.. డబ్బులతో తనను కొనలేరని చెప్పుకొచ్చారు.
వీకెండ్ కామెంట్స్ లో..
అయితే ఆయన చెప్పుదెబ్బలు అని వ్యాఖ్యానించింది మాత్రం ఎల్లో మీడియా పత్రికాధిపతిని దృష్టిలో ఉంచుకునే అని చెబుతున్నారు. ఎందుకంటే సదరు మీడియా అధిపతి తన వీకెండ్ కామెంట్స్ లో పవన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారని రాసుకొచ్చారు.
అందుకే ఈ రాతలపై పవన్ ఇలా సీరియస్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే.. పవన్ ఈ చెప్పుదెబ్బల కామెంట్లు చేయడాన్ని సదరు పత్రిక ఈరోజు ప్రచురించలేదు. దాన్ని బట్టి చెప్పుకోవచ్చు పవన్ చేసిన వ్యాఖ్యలు సదరు మీడియా అధిపతిని ఎంతగా కించ పరిచాయో.