Pawan Kalyan: సింగరేణి కాలనీలో బాలిక కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan: సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్న సంగ‌తి తెలిసిందే.అత‌డి కోసం పోలీసులు ప‌ది బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.ఆయ‌న ఆచూకీ తెలిపిన వారికి ప‌ది ల‌క్షల రివార్డు ఇస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Pawan Kalyan Visit Singareni Colony to Console Victim mother
Pawan Kalyan Visit Singareni Colony to Console Victim mother

నిందితుడిని క‌ఠినంగా శిక్షించాలంటూ సామాన్య ప్రజలతో పాటుగా సినీ తారలు కూడా ముక్తకంఠంతో గళమెత్తుతున్నారు. నాని, మహేష్ బాబు, మంచు మనోజ్, ఆర్పీ ప‌ట్నాయ‌క్‌ లు ఈ ఘటనపై స్పందించగా ప్రముఖ హీరో మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూనుకున్నారు.

Pawan Kalyan Visit Singareni Colony to Console Victim mother
Pawan Kalyan Visit Singareni Colony to Console Victim mother

ఆరేళ్ల మైనర్ బాలిక కుటుంబాన్ని జనసేన చీప్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. మృతురాలి కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటన చాలా కలిచివేస్తోందన్నారు.

Pawan Kalyan Visit Singareni Colony to Console Victim mother
Pawan Kalyan Visit Singareni Colony to Console Victim mother

స‌భ్య స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకునేలా ఇది ఉందని, ప్ర‌భుత్వ పెద్ద‌లు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని వరుసగా రాజకీయ నేతలు, సినీ నటులు పరామర్శిస్తున్నారు.భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను ఇక్కడే దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు.

Pawan Kalyan Visit Singareni Colony to Console Victim mother
Pawan Kalyan Visit Singareni Colony to Console Victim mother

ఆరు రోజుల క్రితం రాజు అనే నిందితుడు సింగరేణి కాలనీలో ఆరేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్యచేశాడు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు.