Pawan Kalyan : బీజేపీని వీడలేక.. కలిసి ఉండలేక జనసేనాని కష్టాలు
NQ Staff - January 25, 2023 / 07:25 PM IST

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు. ప్రస్తుతం బిజెపితో పొత్తులో ఉన్నట్లుగా చెబుతూనే తెలుగుదేశం పార్టీతో సన్నిహిత్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మెలుగుతున్నాడు.
మరో వైపు బిజెపి మరియు తెలుగుదేశం పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీతో జత కట్టేది లేదు అంటూ బిజెపి రాష్ట్ర నాయకులు మరియు జాతీయ స్థాయి నాయకులు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పేశారు.
ఈ నేపథ్యంలో జనసేనాని మాత్రం తెలుగుదేశం పార్టీ ని కూడా కలుపుకు పోవాలని భావిస్తున్నాడు. 2014 సంవత్సరంలో ఎలా అయితే మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయో అదే విధంగా ప్రభుత్వ ఓటు చీలకుండా ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చే విధంగా 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించి తీవ్రంగా కసరత్తు జరుగుతుంది.
బిజెపితో కలిసి ఉండాలా.. తెలుగు దేశం పార్టీతో జతకట్టాలా అనేది తెలియక పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. బిజెపిని వీడలేక.. కలిసి ఉండలేక అన్నట్లుగా జనసేన పరిస్థితి ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో జనసేన పార్టీ దారి ఎటు అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందేమో.