Pawan Kalyan And Chandrababu : టీడీపీ అవినీతిని పవన్ ప్రశ్నించడా.. అసలు పార్టీ పెట్టింది ఎందుకు..?

NQ Staff - October 4, 2023 / 12:38 PM IST

Pawan Kalyan And Chandrababu : టీడీపీ అవినీతిని పవన్ ప్రశ్నించడా.. అసలు పార్టీ పెట్టింది ఎందుకు..?

Pawan Kalyan And Chandrababu :

జనసేన పార్టీని పవన్ పెట్టిన ఉద్దేశం ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. అప్పట్లో ఆయన పార్టీ పెట్టినప్పుడు.. నాకు ఎలాంటి అధికారం అవసరం లేదు. నేను కేవలం అవినీతిని ప్రశ్నించేందుకు మాత్రమే రాజకీయ పార్టీని పెట్టాను. ప్రజల తరఫున పోరాడుతా తప్ప నాకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నాడు. అలాంటి పవన్ ఇప్పుడు మాత్రం పూర్తిగా తన విధానాలు, సిద్ధాంతాలు మార్చేసుకున్నాడు. ముఖ్యంగా టీడీపీ, చంద్రబాబు విషయంలో దాసోహం అయిపోతున్నాడు. చంద్రబాబు ఏం చేసినా సరే మంచి పనే అన్న రేంజ్ లో మద్దతు ప్రకటిస్తున్నాడు.

చంద్రబాబును మొన్న స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేస్తే అందరికంటే ఎక్కువ హడావిడి చేసింది పవన్ మాత్రమే. అసలు సీఐడీ పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేకపోతే కోర్టులు కూడా ఇన్ని సార్లు రిమాండ్ విధించవు కదా. అంటే ఎంతో కొంత అవినీతి జరిగిందనే విషయం చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతోంది. అలాంటిది 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కు అర్థం కావట్లేదా.. పోనీ అర్థం అయినా సరే తన స్వార్థం కోసం సపోర్టు చేస్తున్నారా.. మరి ఆ మాత్రం దానికి పార్టీని పెట్టి ప్రశ్నిస్తా అని అనడం ఎందుకు అని అంటున్నారు టీడీపీకి సపోర్ట్ చేయడం ఇష్టంలేని జనసైనికులు.

వాస్తవానికి పవన్ ఎప్పుడూ ఒక మాట మీద అస్సలు ఉండడు. అప్పుడే ఒక ప్రటకన చేసేసి.. దాన్ని గాలికి వదిలేసి ఇంకో పని చేసేస్తాడు. గతంలో ఇదే చంద్రబాబు, లోకేష్ అవినీతి చేశారంటూ 2018లో పవన్ ఆరోపించాడు. ఆ తర్వాత చంద్రబాబు నిప్పు అంటూ కితాబిస్తున్నాడు. అప్పట్లో ఓటుకు నోటు కేసు విషయంలో కూడా ఇలాగే మాట మార్చాడు.

ఆ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా సరే విచారణ జరిగాక చూద్దాంలే అన్నట్టు మాట మార్చేశాడు. అవినీతి ఎవరు చేసినా ఒకటే కదా. మరి టీడీపీ, చంద్రబాబును ఎందుకు ప్రశ్నించట్లేదు. అంటే ఇప్పుడు ఇంత చేసినా పవన్ టీడీపీకి సపోర్ట్ చేస్తే వైసీపీ చేస్తున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు ఆరోపణల్లో తప్పేముందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు అవినీతి చేసిన చంద్రబాబుతో పొత్తులు పెట్టుకుంటే రేపు పొద్దున ఎన్నికల్లో డబ్బులు పంచినా కూడా సపోర్ట్ చేస్తాడన్నమాట. అంతే కాకుండా సంకీర్ణ ప్రభుత్వంలో చంద్రబాబు అండ్ గ్యాంగ్ మళ్లీ అవినీతి చేసినా సరే అప్పుడు కూడా పవన్ సపోర్ట్ చేస్తాడన్నమాట. అదే సమయంలో జనసైనికులను కూడా వారికి అండగా ఉండాలని చెబుతున్నాడు. అంటే జనసైనికులను కూడా అవినీతి చేసుకోండి అని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడా..?

ఇదే జగన్ ను సీఐడీ అరెస్ట్ చేస్తే అవినీతి జరిగిందంటూ కొండెక్కి మొత్తుకున్న పవన్.. ఇప్పుడు మాత్రం చంద్రబాబును అదే సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తే తప్పుబడుతున్నాడు. అంటే జగన్ ఏం చేసినా తప్పే.. చంద్రబాబు ఏం చేసినా మంచి పనే అన్న రేంజ్ లో చెబుతున్నాడు పవన్. అంటే పవన్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఈ మాత్రం దానికి పార్టీ పెట్టడం ఎందుకో ఆయనే చెప్పాలి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us