Pawan Kalyan : కొడాలి నాని కంటే ఛండాలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారా.?

NQ Staff - October 18, 2022 / 07:08 PM IST

Pawan Kalyan : కొడాలి నాని కంటే ఛండాలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారా.?

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట మీద అదుపు కోల్పోయి మాట్లాడారా.? అంటే, ఔననే చర్చ సోషల్ మీడియాలో వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కానీ, ‘కొడాలి నాని బూతులతో పోల్చితే, జనసేనాని మాట్లాడిన మాటల్లో అభ్యంతకరమైన పదాలేమున్నాయ్.?’ అన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.

అయితే, పవన్ కళ్యాణ్ ప్రజా ప్రతినిథి కాకపోయినా.. ఆయన ఓ రాజకీయ పార్టీకి అధినేత. ఖచ్చితంగా ఆయన మాట అదుపులో వుండాల్సిందే. అదే సమయంలో, మంత్రిగా పనిచేసిన కొడాలి నాని ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి. కానీ, మంత్రి పదవిలో వున్నప్పుడెప్పుడూ ఆయన సంయమనం పాటించలేదు, బాధ్యతగా వ్యవహరించలేదు.

తప్పుందా.? తప్పు లేదా.?

ఇదే అసలు సమస్య. నో డౌట్ పవన్ కళ్యాణ్ వీరావేశానికి లోనయ్యారు.. తప్పుడు మాటలు చాలానే మాట్లాడేశారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, రాజకీయాల్లో బూతులు సర్వసాధారణమనీ, ‘అభిమానులకు బీపీ వస్తే, దాడులు జరుగుతాయనీ’ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సందేశమిచ్చాక, పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అందులో వింతేముంది.?

ఓ పేర్ని నాని, ఓ వెల్లంపల్లి శ్రీనివాస్, ఓ కొడాలినాని.. ఓ గోరంట్ల మాధవ్.. ఓ తమ్మినేని సీతారాం.. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలో చాలామంది బూతు పురాణాల్లో ఆరితేరిపోయారు. వారి బూతుల్ని స్త్రోత్రాలుగా భావిస్తోన్న వైసీపీ మేధావులు ఇప్పుడు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడటం హాస్యాస్పదం కాక మరేమిటి.?

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us