Pawan kalyan : జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు రాజకీయంగా నిలకడ ప్రదర్శించలేకపోయారు. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అనే ఇంగ్లిష్ సామెత మాదిరిగా నిలకడలేని వ్యక్తి నికరంగా సాధించేది ఏమీ ఉండదని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చిన కొత్తలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఏ పార్టీకీ మద్దతు ఇవ్వలేదు. అన్ని పార్టీల్నీ సమానంగా విమర్శించాడు. తర్వాత సొంతగా జనసేన పార్టీ పెట్టాక బీజేపీకి, టీడీపీకి సపోర్ట్ చేశాడు.
అనంతరం..
2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతోపాటు దళిత నాయకురాలు మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీతోనూ కలిసి పనిచేశాడు. ఈ కాంబినేషన్ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతానికి కమలం పార్టీతో చేతులు కలిపాడు. తిరుపతిలో బీజేపీతో కలిసి పోటీచేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇకనైనా ఒక స్టాండ్ మీద ఉండాలని నిర్ణయించుకున్నాడంట. రాజకీయంలో మరీ ముక్కుసూటిగా వెళితే కుదరదని, కాస్త పట్టువిడుపులు కూడా ఉండాలని పవర్ స్టార్ తెలుసుకున్నట్లు సమాచారం.
అందుకే: Pawan kalyan
జనసేనాధినేత తన సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విశాల దృక్పథంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. ఇప్పటికే కొంచెం ఆ దిశగా ఆయనలో మార్పు కనిపిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకూడదు, కానివ్వను అంటూ 2019 ఎన్నికల్లో బీరాలు పలికిన పవన్ కళ్యాణ్ చివరికి తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. అంతేకాదు. మొదట్లో వైఎస్ జగన్ ను సీఎంగా ఒప్పుకోనని కూడా అన్నాడు.
పేరెత్తటానికే..
జగన్ పూర్తి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం అందరికీ తెలిసిందే కదా. కానీ, దాన్ని సైతం పూర్తిగా తన నోటి నుంచి పలకటం ఇష్టంలేనంతగా పవన్ కళ్యాణ్ లో ఈర్ష్య, అసహనం పెరిగిపోయిందని వైఎస్సార్సీపీ నాయకులు అంటుంటారు. దీంతో ముఖ్యమంత్రిని పట్టుకొని జగన్ రెడ్డి అంటూ వెటకారంగా సంభోదిస్తున్నాడని తప్పుపడుతున్నారు. అయితే.. అలాంటి వ్యక్తి వ్యవహార శైలి ఈమధ్య కాస్త మారిందనే టాక్ వినిపిస్తోంది.
ఓకే.. ఓకే: Pawan kalyan
‘‘జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన్ని స్వయంగా కలుస్తాను. గతంలో ఇలాగే చంద్రబాబును, ప్రధాని మోడీని చాలా సార్లు కలిశాను. అధికార పార్టీని బహిరంగంగా విమర్శించటం కన్నా ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ని ప్రత్యక్షంగా కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లటం మంచిది’’ అని పవన్ కళ్యాణ్ తన సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది.

ఎందుకు?..
తనపై ఇన్నాళ్లూ ఉన్న ‘చంద్రబాబు’ ముద్రను తొలగించుకోవటం కోసమే పవన్ కళ్యాణ్ త్వరలో సీఎం జగన్ తో భేటీ కానున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఏపీ బీజేపీతో స్నేహం చేస్తున్నప్పటికీ జగన్ పైన మొండిగా విమర్శలు చేయటం సరికాదని పవర్ స్టార్ గ్రహించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ప్లస్ కాకుండా జనసేన-బీజేపీ కూటమికి కూడా కలిసొచ్చేలా పవర్ స్టార్ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారని వివరిస్తున్నారు.