Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లోకి ఎందుకెళ్లారు? ప్యాకేజీ అందకనా?..

Pawan Kalyan : ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైన టైమ్లీ, లైవ్లీ కామెంట్లతో భలే కామెడీ చేస్తారు. అందుకే ఆయన మీడియా ముందు గానీ అసెంబ్లీలో గానీ మాట్లాడుతుంటే ప్రతిఒక్కరూ సైలెంటుగా వింటూ ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు. అత్యంత స్పష్టంగా, గట్టిగా, హాస్యాస్పదంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మొదలుకొని ఆయన కొడుకు లోకేష్ వరకు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదలుకొని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వరకు అంబటి రాంబాబు అందరిపైనా అవలీలగా పంచ్ లు, కౌంటర్లు, సెటైర్లు, జోక్ లు వేయగలరు. సూటిగా విమర్శలు చేయగలరు. ఇదే క్రమంలో ఇవాళ మంగళవారం తిరుపతిలో మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రెండు ముఖ్యమైన ప్రశ్నలు సంధించారు.

Pawan Kalyan : mla ambati rambabu satires on pawan kalyan and jp nadda
Pawan Kalyan : mla ambati rambabu satires on pawan kalyan and jp nadda

భయమా?.. సొమ్ములా?..

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందిలో చాలా మందికి కరోనా వైరస్ సోకటంతో ఆయన మొన్నటి నుంచి హోం క్వారంటైన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. దీన్ని అంబటి రాంబాబు తన రాజకీయ విమర్శల కోసం కరెక్టుగా పట్టేసుకున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికే పరిమితమైంది కరోనా వైరస్ వ్యాప్తికి భయపడా లేక బీజేపీ నుంచి ప్యాకేజీ అందకనా? అంటూ పొలిటికల్ లాజిక్ పాయింట్ తీశాడు. పవన్ కళ్యాణ్ ని సహజంగా ప్యాకేజీ స్టార్ అని వైఎస్సార్సీపీవాళ్లు అంటుంటారు కదా అందుకని అంబటి ఇలా అడిగారు.

ఆ స్థాయి నుంచి.. ఈ స్థాయికి: Pawan Kalyan

జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి దిగజారారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని క్షేత్ర స్థాయిలో నిజంగా ఏం జరుగుతోందో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలో అపొజిషన్ పార్టీ టీడీపీకి 30 శాతానికి మించి ఓట్లు రావట్లేదని సర్వేల్లో తేలిందని వెల్లడించారు. ఓడిపోవటం ఖాయమని తెలిసి చంద్రబాబు రాళ్ల దాడి పేరుతో గిమ్మిక్కులు చేస్తున్నారని శాసన సభ్యుడు అంబటి రాంబాబు చురకలంటించారు.

Advertisement