Pawan Kalyan : ఎట్టకేలకు విశాఖ వీడిన పవన్ కళ్యాణ్.! ఇకపై బెజవాడలో జనసేన హంగామా.!

NQ Staff - October 17, 2022 / 06:45 PM IST

Pawan Kalyan : ఎట్టకేలకు విశాఖ వీడిన పవన్ కళ్యాణ్.! ఇకపై బెజవాడలో జనసేన హంగామా.!

Pawan Kalyan : జస్ట్ ప్లేస్ మారిందంతే.! హంగామా మాత్రం సేమ్ టు సేమ్.! వేదిక బెజవాడకు మారిందా.? మంగళగిరి కేంద్రంగా రాజకీయ రచ్చ రంబోలా చూడబోతున్నామా.? కాస్సేపట్లో తేలిపోతుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు విశాఖపట్నం నుంచి విజయవాడకు పయనమయ్యారు. విశాఖలోని నోవెటెల్ నుంచి ప్రత్యేక బందోబస్తు నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా.. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు.

చాలామందిని విడిపించాం.. మరికొందర్ని విడిపించాల్సి వుంది..

అక్రమ కేసులు బనాయించి జనసేన నాయకులు, కార్యకర్తల్ని అరెస్టు చేశారనీ, వారిలో కొందరికి బెయిల్ వచ్చిందనీ, ఈ విషయంలో జనసేన లీగల్ టీమ్ సమర్థవంతంగా పనిచేసిందని జనసేనాని చెప్పారు. మరికొందరు నేతలకు రిమాండ్ విధించడం జరిగిందనీ, హైకోర్టులో న్యాయపోరాటం చేసేందుకోసం వెళుతున్నట్లు జనసేనాని విజయవాడకు బయల్దేరే ముందు చెప్పారు.

అరెస్టు చేసినవారిని విడిచి పెట్టేంతవరకూ విశాఖ నుంచి కదిలేది లేదని చెప్పిన జనసేనాని, అరెస్టయినవారిలో సగానికి పైగా నేతలు విడుదలవడంతో వారితో ప్రత్యేకంగా చర్చించారు. న్యాయ పోరాటం విజయవాడ వేదికగా చేయాల్సి వున్నందున.. విశాఖ నుంచి జనసేనాని విజయవాడకు వెళ్ళారని జనసేన నేతలు చెబుతున్నారు.

గవర్నర్ విశ్వ భూషన్ హరిచందన్‌తో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశముంది. మరోపక్క, విశాఖ నుంచి జనసైనికులు ఉత్తరాంధ్రలోని తమ తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు.. జనసేనాని విజయవాడకు పయనమవడంతో.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us