Janavani Jana Sena Bharosa : అనారోగ్యంతో బాధపడుతున్న జనసేనాని, జనవాణి వాయిదా.!

NQ Staff - July 20, 2022 / 03:23 PM IST

Janavani Jana Sena Bharosa : అనారోగ్యంతో బాధపడుతున్న జనసేనాని, జనవాణి వాయిదా.!

Janavani Jana Sena Bharosa : జనసేనాని పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, జనసేనాని వెంట వుండే వ్యక్తిగత సహాయ సిబ్బంది కూడా అనారోగ్యం పాలయ్యారట. ఈ విషయాన్ని జనసేన పార్టీ స్వయంగా వెల్లడించింది.

ప్రతి ఆదివారం జనవాణి జనసేన భరోసా పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రజల నుంచే నేరుగా వారెందుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాల్ని జనసేనాని స్వీకరిస్తున్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కారం దిశగా జనసేన నేతలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆదివారం కూడా ఈ కార్యక్రమం జరగాల్సి వుండగా, దాన్ని వాయిదా వేస్తున్నట్లు జనసేన ప్రకటించింది.

స్వల్ప అనారోగ్యమేనా.?

Pawan Kalyan Carrying Program Janavani Jana Sena Bharosa

Pawan Kalyan Carrying Program Janavani Jana Sena Bharosa

ప్రస్తుతం కోవిడ్ విజృంభణ మళ్ళీ పెరుగుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి దేశవ్యాప్తంగా. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు కొంత మెరుగ్గానే వున్నా, ప్రముఖుల కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.

జనసేనాని పవన్ కళ్యాణ్, జనసేన ముఖ్య నేతలు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సహాయ సిబ్బంది కేవలం జ్వరం తదితర సమస్యలతోనే బాధపడుతున్నారా.? కోవిడ్ సమస్యలేమైనా వచ్చాయా.? అన్నదానిపై జనసేన వర్గాల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే, జనసేన పార్టీ తరఫున అధికారిక ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. ఈనెల 31న యధాతథంగా జనవాణి జరుగుతుందట. అయితే, ఎక్కడ నిర్వహించేదీ త్వరలో చెబుతామని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us