Pawan Kalyan : ఒక్క పెళ్ళి, ముప్ఫయ్ స్టెప్నీలు: వైసీపీ నేతలపై జనసేనాని ఫైర్

NQ Staff - October 18, 2022 / 09:03 PM IST

Pawan Kalyan : ఒక్క పెళ్ళి, ముప్ఫయ్ స్టెప్నీలు: వైసీపీ నేతలపై జనసేనాని ఫైర్

Pawan Kalyan : ప్రతిసారీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే తీవ్రాతి తీవ్రమైన విమర్శ, ఆయన వ్యక్తిగత జీవితం గురించే. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్ళి విశాఖకు చెందిన యువతితో జరిగింది. కానీ, కొద్ది కాలానికే ఆమె నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు.

రెండో పెళ్ళి సినీ నటి రేణు దేశాయ్‌తో జరిగింది.. కానీ, పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ అంతకు ముందే కొంతకాలం పాటు సహజీవనం చేశారు. 2009 ఎన్నికలకు ముందు అధికారికగా వీరి వివాహం జరిగింది. ఇక, రేణు దేశాయ్‌తో విడాకుల తర్వాత, అన్నా లెజ్నెవా అనే రష్యన్ యువతితో పవన్ కళ్యాణ్ వివాహం జరిగింది.

జనసేన పార్టీ పెట్టాకనే మూడో పెళ్ళిపై అధికారిక ప్రకటన..

జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించిన క్రమంలోనే అన్నా లెజ్నెవాతో ఆయనకు పెళ్ళయినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.. అది కూడా ఎన్నికల అఫిడవిట్ రూపంలో. సరే, ఇదంతా ఆయన వ్యక్తిగత జీవితం. అయినాగానీ, రాజకీయాలన్నాక విమర్శలు వస్తాయ్ కదా.!

పదే పదే తన మూడు పెళ్ళిళ్ళ వ్యవహారంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో జనసేనాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాజకీయ ప్రత్యర్థులకి. ‘ఒక్క పెళ్ళి చేసుకుని ముప్ఫయ్ స్టెప్నీలతో తిరిగే మీరా నా మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేది..’ అంటూ వైసీపీ నేతల మీద విరుచుకుపడ్డారు జనసేన అధినేత. ‘సన్నాసులు, యెదవలు..’ అనే మాటల చాలా అలవోకగా పవన్ విమర్శల్లో దొర్లేశాయి.

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us