Jr NTR Birth : యంగ్ టైగర్ ఎన్టీయార్ పుట్టుకపై టీడీపీ మద్దతుదారుల జుగుప్సాకరమైన ట్వీట్లు.!

NQ Staff - September 24, 2022 / 10:45 PM IST

Jr NTR Birth : యంగ్ టైగర్ ఎన్టీయార్ పుట్టుకపై టీడీపీ మద్దతుదారుల జుగుప్సాకరమైన ట్వీట్లు.!

Jr NTR Birth : యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో బురద చల్లుతోన్న విషయం విదితమే. స్వర్గీయ ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయమై జరుగుతున్న రాజకీయ రచ్చలోకి యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని లాగారు.

తనవంతుగా బాధ్యతియుతమైన రీతిలో జూనియర్ ఎన్టీయార్ తన తాత పేరు విషయమై స్పందిస్తే, ‘ఇదేం స్పందన.?’ అంటూ టీడీపీ అసహనం వెల్లగక్కుతోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీయార్ పుట్టుక గురించి అభ్యంతరకరమైన రీతి లో కామెంట్లను సోషల్ మీడియా వేదికగా టీడీపీ మద్దతుదారులు పోస్ట్ చేస్తున్నారు.

అప్పుడు బాధపడ్డాడు.. ఇప్పుడు బాధపెడుతున్నారు..

నారా లోకేష్ పుట్టుక గురించీ, భువనేశ్వరి వ్యక్తిత్వం గురించీ వైసీపీ నేతలు విమర్శలు చేస్తే, మీరు బాధపడ్డారు. మరి, ఎన్టీయార్ తల్లి గురించి మీరెలా అభ్యంతకరమైన ప్రవర్తన ప్రదర్శిస్తారు.? ఎన్టీయార్ పుట్టుక గురించి అభ్యంతకరమైన వ్యాఖ్యలెలా చేస్తారు.? అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

వివాదం టీడీపీ – వైసీపీ మధ్య అయితే, ఇప్పుడు ఆ వివాదం పూర్తిగా తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీయార్‌కీ, జూనియర్ ఎన్టీయార్ వ్యతిరేక వర్గానికీ మధ్య జరుగుతున్న వ్యవహారంలా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ ఏం రాజకీయం చేస్తోందో, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి అయినా అర్థమవుతోందా.?

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us