NTR : ఆసుపత్రిలో కొడాలి నానిని పరామర్శించిన జూనియర్ ఎన్టీయార్.!

NQ Staff - November 22, 2022 / 08:25 AM IST

NTR : ఆసుపత్రిలో కొడాలి నానిని పరామర్శించిన జూనియర్ ఎన్టీయార్.!

NTR : వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అనారోగ్యంతో హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

కిడ్నీ సంబంధిత సమస్యతో కొడాలి నాని ఆసుపత్రిలో చేరగా, ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు సమాచారం.

కొడాలి నానికి ఎన్టీయార్ పరామర్శ…

కొడాలి నాని, యంగ్ టైగర్ ఎన్టీయార్ గతంలో అత్యంత సన్నిహితులు. అయితే, టీడీపీని కొడాలి నాని వీడాక, ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగింది. కాదు కాదు, గ్యాప్ క్రియేట్ చేయబడింది. అయినాగానీ, ఇద్దరి మధ్యా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్లు తరచూ గాసిప్స్ వినిపిస్తూనే వుంటాయి.

తాజాగా కొడాలి నానిని ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీయార్ పరామర్శించాడన్న వార్తతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల్లో కలవరం బయల్దేరింది. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న పాత స్నేహితుడ్ని పరామర్శిస్తే తప్పేంటి.? అని యంగ్ టైగర్ అభిమానులు అంటున్నారు.

ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం వెల్లడి కావాల్సి వుంది. జూనియర్ ఎన్టీయార్‌తో కొడాలి నాని పలు సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us