NTR : లీడర్ అవ్వక్కర్లేదు.! గుట్కా నానిలా మాత్రం కాకూడదు.!
NQ Staff - September 23, 2022 / 09:34 AM IST

NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యవహారం పెను రాజకీయ దుమారం రేపుతోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుని హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని ఏపీ సీఎం వైఎస్ జగన్ పెట్టుకోవడంపై రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

NTR Tweet Fans Comparision with Gutka Nani Andhra Politics
జూనియర్ ఎన్టీయార్ ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించడంతో.. అటు జూనియర్‌కి మద్దతుగానూ, ఇంకో వైపు జూనియర్‌కి వ్యతిరేకంగానూ బోల్డన్ని అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.
గుట్కా నానిగాడిలాగా వద్దు.. ‘లీడర్ అవ్వాలంటే బూతులు తిట్టాలా.? అలాగైతే మా యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎప్పటికీ లీడర్ అవకపోయినా మాకు మంచిదే..’ అని జూనియర్ ఎన్టీయార్ సపోర్టర్స్ కుండబద్దలుగొట్టేస్తున్నారు. ఇంతకీ ఎవరా గుట్కా నాని.? అంటే, అది వేరే చర్చ.
తెలుగుదేశం పార్టీ పగ్గాల్ని జూనియర్ ఎన్టీయార్ చేపట్టాలన్న డిమాండ్ ఎప్పటినుంచో వుంది. టీడీపీకి లీడర్ అవ్వాలనుకున్నప్పుడు, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయమై ఘాటుగా స్పందించాలనే డిమాండ్ టీడీపీ నుంచి వస్తోంది. అంటే, ‘వైసీపీని బూతులు తిట్టాలా.?’ అని జూనియర్ ఎన్టీయార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బోల్డంత సినిమా కెరీర్ వదులుకుని, జూనియర్ ఎన్టీయార్ ఎందుకు రాజకీయాల్లోకి వస్తాడు.? వచ్చినా ప్రయోజనమేంటి.?