NTR : ఎన్టీఆర్ పేరు తొలగింపు: జూనియర్ ఎన్టీఆర్ ను సాంతం వాడేస్తున్నారుగా

NQ Staff - September 23, 2022 / 11:14 AM IST

NTR : ఎన్టీఆర్ పేరు తొలగింపు: జూనియర్ ఎన్టీఆర్ ను సాంతం వాడేస్తున్నారుగా

NTR : ఏపీ రాజకీయాలను ఇప్పుడు ‘ఎన్టీఆర్ పేరు తొలగింపు’ అంశం తెగ షేక్ చేస్తోంది. ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరును.. ‘వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ’గా సీఎం జగన్ మార్చడం ఈ వివాదానికి కారణమైంది. ఈ ఒక్క పేరు మార్పుతో టీడీపీ భగ్గుమన్నది. ఇన్నాళ్లు.. చంద్రబాబుకు దూరమైన కమ్మ నేతలు.. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇప్పుడు టీడీపీ తరుఫున గళం వినిపించారు. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేశారు. జగన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

NTR Name removal issue going wrong for jr.NTR

NTR Name removal issue going wrong for jr.NTR

కమ్మ నేతలు, వ్యాపారులు, సినీ ప్రముఖులు ఈ స్థాయిలో ఉన్నారంటే నాడు సీఎంగా ఎన్టీఆర్ వేసిన అడుగులే కారణం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సామాజికవర్గంలోని ఈ నేతలంతా బాగుపడ్డారు. చెన్నై నుంచి సినీ పరిశ్రమను హైదరాబాద్ తరలించి వారికి స్థలాలు, ప్రోత్సాహకాలు ఇచ్చి ఎన్టీఆర్ నిలబెట్టారు. వ్యవసాయం చేసుకునే కమ్మ వారిని పారిశ్రామికవేత్తలుగా రాయితీలతో ఇతర పరిశ్రమల వైపు మళ్లించారు. అందుకే ఎన్టీఆర్ పేరు తొలగించగానే వారిందరిలో కోపం కట్టలు తెచ్చింది. చంద్రబాబు తీరుతో దూరమైన వారు కూడా ఇప్పుడు సపోర్టుగా గళం విప్పేలా చేసింది.

NTR Name removal issue going wrong for jr.NTR

NTR Name removal issue going wrong for jr.NTR

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ తన తాత పేరు తొలగించగలరు కానీ.. ఆయనకు జనాల గుండెల్లో ఉన్న చెరగని ముద్రను చెరిపివేయలేరు అంటూ వైసీపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. అయితే జూనియర్ ఇలా మాట్లాడడం ఆలస్యం.. టీడీపీ నేతలంతా ఆయనను ఓన్ చేసుకొని తమ వాడంటూ తెగ హంగామా చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను సాంతం వాడేస్తూ జగన్ ను విమర్శిస్తున్నారు. టీడీపీకి కొండంత సపోర్టు వచ్చిందంటూ హల్ చల్ చేస్తున్నారు. జగన్ టార్గెట్ గా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.

NTR Name removal issue going wrong for jr.NTR

NTR Name removal issue going wrong for jr.NTR

ఇక వైసీపీ బ్యాచ్ ఊరుకుంటుందా? గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. చంద్రబాబు చేయని పనిని జగన్ చేశాడని.. ఆయన పుట్టిన విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామని చెబుతున్నారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ సహా నందమూరి వారసులు తెలుగుదేశం పార్టీని లాక్కున్న నారా చంద్రబాబు నుంచి పార్టీని తీసుకొని మీ పౌరుషం ఏంటో చూపించాలని.. తొడలు మా ముందు కాదు.. చంద్రబాబు ముందు కొట్టాలని తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. జూ.ఎన్టీఆర్ స్పందించాల్సింది ఎన్టీఆర్ పేరు మీద కాదు.. నారా చంద్రబాబు లాక్కున్న మీ సొంత పార్టీ తెలుగుదేశం మీద అంటూ కౌంటర్ ఇచ్చారు.

అయితే లేడికి లేచించే పరుగు అన్నట్టు.. జగన్ తీసుకున్న నిర్ణయం టీడీపీవారికే కాదు.. సొంత వైసీపీ నేతలకు నచ్చలేదు. స్వయానా ఆయన చెల్లెలు షర్మిల కూడా ఈ ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తప్పుపట్టారు. వైఎస్ఆర్ కంటే కూడా అన్ని విషయాల్లో ఎన్టీఆర్ ముందున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ తన తండ్రిపై ప్రేమను చూపించడానికి.. ఎన్టీఆర్ ను అవమానించడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు. ఇలాంటి పొరపాట్ల వల్ల ఇప్పుడు కమ్మ సామాజికవర్గం సహా కొందరు వైసీపీకి దూరమవుతున్నారు. జగన్ చేసిన ఈ పని ఆయనకు రాజకీయంగా తీవ్ర నష్టం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us