Nimmagadda : రివర్స్ చావు దెబ్బ : చంద్రబాబు దెబ్బకి దారుణంగా ఇరుక్కున్న నిమ్మగడ్డ?

Nimmagadda : ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల కన్నా సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లీడర్ షిప్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎస్ఈసీకి) మధ్య జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఎలక్షన్ కోడ్ సాకుతో ఎస్ఈసీ అధికార పార్టీవాళ్లకి, ప్రభుత్వ అధికారులకి పట్టపగలే చుక్కలు చూపిస్తుండగా వైఎస్సార్సీపీవాళ్లు కూడా నిమ్మగడ్డ ఎప్పుడు, ఎక్కడ దొరుకుతాడా అని కాచుకొని కూర్చుంటున్నారు. ఎట్టకేలకు వాళ్లకి ఎస్ఈసీ నిన్న చిక్కాడు.

నేనింతే..

నిమ్మగడ్డ వ్యవహార శైలి చూస్తుంటే రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని కొంచెం అతి చేస్తున్నాడనిపిస్తోంది. తానొక్కణ్నే నిజాయతీపరుణ్నని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో బీజేపీ లీడర్లను ఒక హోటల్ లో సీక్రెట్ గా కలవటం, మొన్నీమధ్య ఓ గుడిలో తెలుగుదేశం పార్టీ నేతల నుంచి సన్మానాలు అందుకోవటం వంటివాటిపై మాత్రం ఆయన సమాధానం చెప్పరు. అధికార పార్టీవాళ్లనైతే అడుగడుగునా రూల్స్ రూల్స్ అంటూ తప్పుపడుతున్నాడనే భావన సామాన్య ప్రజలకు కలుగుతోంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు టీడీపీపై ఏ చర్య తీసుకుంటారో చూడాలి.

ఏమైంది?: Nimmagadda

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు షురూ అవటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు ‘పంచాయతీలకు పంచసూత్రాలు’ అంటూ నిన్న (గురువారం) మేనిఫెస్టో విడుదల చేశారు. దాని మీద తనతోపాటు తన చినబాబు ఫొటో కూడా ప్రింట్ చేయించారు. ఎలక్షన్ కోడ్ కి ఎంతటివారైనా అతీతులు కాదంటూ పత్తిత్తు మాటలు చెప్పిన నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో విషయంలో చంద్రబాబు నుంచి వివరణ కోరతారా లేదా అని విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు వంటి వైఎస్సార్సీపీ నాయకులు నిలదీస్తున్నారు.

Nimmagadda-will-he-take-action-on-tdp
Nimmagadda-will-he-take-action-on-tdp

భలే.. భలే..

తాను ఎవరు చెప్పినట్లూ చేయట్లేదని, ఎవరి ప్రాపకం కోసమో పాకులాడట్లేదని, ఎస్ఈసీగా స్వతంత్ర్యంగానే వ్యవహరిస్తున్నానని నిమ్మగడ్డ నిరూపించుకోవటానికి ఇదొక మంచి అవకాశమని అధికార పార్టీవాళ్లు సూచిస్తున్నారు. వాళ్ల ఆరోపణలను కొట్టివేయాలంటే టీడీపీ మ్యానిఫెస్టోపై చర్యలు తీసుకోవాలని విమర్శకులు నిమ్మగడ్డని డిమాండ్ చేస్తున్నారు. అసలు పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతోనే జరగవు. అలాంటిది ఓ పొలిటికల్ పార్టీగా టీడీపీ ఇలా ఎలక్షన్ మ్యానిఫెస్టోని విడుదల చేయటం ఎలక్షన్ కోడ్ ని బ్రేక్ చేయటం కిందికే వస్తుందని, మొత్తానికి బాబు తన తొందరపాటుతనంతో నిమ్మగడ్డను గొప్పగా ఇరికించాడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement